
టీచర్ల అంటే విద్యార్థులకు మార్గదర్శిగా ఉండాలి. విద్యార్థులు పెడదారి పడితే వారిని సరైన మార్గంలో పెట్టాలి. విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచరే స్టూడెంట్ తో ప్రేమాయణం నడిపింది. చివరకు పిల్లాడిని తీసుకుని జంప్ అయ్యింది. ఈ ఘటన హైదరాబాద్ లోని చందానగర్ లో జరిగింది.
చందానగర్ పీఎస్ పరిధిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఓ మహిళా(23) టీచర్ గా పనిచేస్తుంది. అయితే అదే స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతోన్న విద్యార్థి కనిపించకుండా పోయాడు. పిల్లాడు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అసలు విషయం బయటపడింది.
అయితే ఒకే రోజు నుంచి ఇద్దరు కనిపించకపోవడంతో తల్లిదండ్రులకు, అటు పోలీసులకు అనుమానం వచ్చింది. స్కూల్ లో విచారణ జరిపిన పోలీసులు వారి కోసం గాలించడం మొదలు పెట్టారు. ఇద్దరిన ఓ ప్రాంతంలో గుర్తించిన పోలీసులు హైదరాబాద్ కు తీసుకొచ్చారు. కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అయితే ఈ ఘటనపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. టీచర్లే ఇలా ప్రవర్తిస్తే చదువుకునే విద్యార్థుల ఫ్యూచర్ ఏంటని ప్రశ్నిస్తున్నారు.