రోజురోజుకు సైబర్ నేరగాళ్లు వలలో పడే వారి బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. అమాయకులకు ఫేక్ కాల్స్ చేసి బెదిరించి లక్షలు, కోట్లు కొట్టేస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లోని ఆగ్రాలో ఓ సైబర్ నేరగాడు చేసిన పనికి టీచర్ గుండెపోటుతో చనిపోయింది.
నిందితుడు తాను పోలీస్ అధికారిని అని సెప్టెంబర్ 30న ఓ మహిళా టీచర్ కు ఫోన్ చేశాడు. ఆమె కూతురు ఓ సెక్స్ రాకెట్ కేసులో ఇరుక్కుందని.. కేసు నుంచి అమ్మాయిని తప్పించాలంటే రూ.లక్ష డిమాండ్ చేశాడు. లక్ష రూపాయిలు ఇవ్వకుంటే వీడియోలు లీక్ చేస్తామని బెందిరించాడు. బాధితురాలు ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఆమె కాళ్లు చేతులు ఆడలేదు.. ఆయోమయానికి గురైంది. రూ.లక్ష నిందితుడు చెప్పిన అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేయాలని కొడుకు దివ్యాన్షుకు చెప్పింది. అతను నెంబర్ చెక్ చేయగా ఫోన్ నెంబర్ కు ముందు +92 అని ముందు.. వెంటనే అది పాకిస్థాన్ నుంచి వచ్చిన కాల్ గా దివ్యాన్షు గుర్తించాడు. అది ఓ ఫేక్ కాల్ అని దివ్యాన్షు తల్లికి ధైర్య్ఘం చెప్పే ప్రయత్నం చేశాడు. ఆమె అప్పటికీ చాలా ఆత్రుతగా ఉంది.
ALSO READ | సైబర్ క్రిమినల్స్ కోసం ఆపరేషన్ చక్ర 3
అనారోగ్యానికి గురైవ్వడం ప్రారంభమైంది. దివ్యాన్షు కాలేజీలో ఉన్న అక్కతో మాట్లాడించాడు. ఆమె తల్లితో తాను బాగానే ఉన్నా అని కూడా చెప్పింది. అయితే.. ఈ ఘటన మహిళ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. ఆమె నిందితునితో కాల్ మాట్లాడిన 15 నిమిషాల తర్వాత అదే నెంబర్ నుంచి సైబర్ నేరగాళ్లు మళ్లీ కాల్ చేసి మీ అమ్మాయిపై యాక్షన్ తీసుకుంటున్నాము.. ఇక మీ ఇష్టం అని కాల్ కట్ చేశారు. సాయంత్రం కాలేజీ నుంచి కుతురు తిరిగి వచ్చిన తర్వాత ఆమెకు అస్వస్థత మొదలైంది. ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. టీచర్ అయిన బాదితురాలు ఆయోమయానికి గురై గుండెపోటుతో చనిపోయింది.