ఎన్నికల విధుల్లో పాల్గొన్న టీచర్స్కి రెమ్యూనరేషన్ ఇవ్వాలి : ఉపాధ్యాయ సంఘాల నాయకులు

ఎన్నికల విధుల్లో పాల్గొన్న టీచర్స్కి రెమ్యూనరేషన్ ఇవ్వాలి : ఉపాధ్యాయ సంఘాల నాయకులు

తొర్రూరు, వెలుగు : ఎన్నికల విధులు, కుల గణనలో పాల్గొన్న ఉపాధ్యాయులకు రెమ్యూనరేషన్ వెంటనే చెల్లించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరారు. ఈ మేరకు టీపీటీఎఫ్, ఎస్టీయూ, పీఆర్టీయూ సంఘాల నాయకులు మంగళవారం మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలో కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం పలు అంశాలపై కలెక్టర్ తో చర్చించారు. దీంతో కలెక్టర్ సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు.

గ్రామపంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఏకగ్రీవమైన చోట్ల, రిజర్వ్ సిబ్బందికి రెమ్యూనరేషన్ చెల్లించేందుకు ఎంపీడీవోలను ఆదేశించనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఎస్టీయూ అధ్యక్ష కార్యదర్శులు గన్నోజు ప్రసాద్, కొరవి సుధాకరాచారి, టీపీటీఎఫ్ అధ్యక్షుడు బలాస్టి రమేశ్, పీఆర్‌టీయూ గీత, యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి యాకూబ్, ఎస్సీ, ఎస్టీ సంఘం నాయకులు ప్రభాకర్, డీటీఎఫ్ నాయకులు భాస్కర్, దేవేందర్ రాజు, తపస్ నాయకులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు