317 జీవోను రివ్యూ చేయాలి

317 జీవోను రివ్యూ చేయాలి

317 జీవోని రివ్యూ చేయాలని కోరుతూ ప్రభుత్వ ఉపాధ్యాయులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. సీనియారిటీ ప్రకారం కాకుండా స్థానికత లెక్కన పోస్టింగ్ లు ఇవ్వాలని కోరారు. 317 జీవో వల్ల కుటుంబాలు విడిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. ‘‘సీఎంకి మా గోడు చెప్పుకునేందుకు వస్తే.. మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మాకు అన్యాయం జరుగుతోంది’’ అని టీచర్లు  ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇక హైదరాబాద్ బంజారాహిల్స్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి వీఆర్ఏలు యత్నంచారు. వారిని లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వీఆర్ఏలు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. సీఎం కేసీఆర్ VRAలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.  వెంటనే రాష్ట్ర సర్కార్ ప్లే స్కేల్ ను పెంచాలన్నారు. ఇప్పటికే ఒత్తిడి తట్టుకోలేక రాష్ట్ర వ్యాప్తంగా 36మంది VRAలు సూసైడ్ చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీఆర్ఏల ను అరెస్ట్ చేసిన పోలీసులు... స్టేషన్ కు తరలించారు. వీఆర్ఏలు, టీచర్ సంఘాలు అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. అసెంబ్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పటికే పోలీసులు 144 సెక్షన్ విధించి, భద్రతను కట్టుదిట్టం చేశారు.