మ్యూచువల్ లో వచ్చిన టీచర్లకు బదిలీల్లో అవకాశమివ్వాలె: టీచర్లు విజ్ఞప్తి

మ్యూచువల్ లో వచ్చిన టీచర్లకు బదిలీల్లో అవకాశమివ్వాలె: టీచర్లు విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు:  జీవో 317లో భాగంగా మ్యూచువల్ లో వచ్చిన టీచర్లకు ప్రస్తుత బదిలీల్లో అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి టీచర్లు విజ్ఞప్తి చేశారు. శనివారం విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణను కలిసి ఈ మేరకు 317  బాధిత మ్యూచువల్ టీచర్ల ప్రతినిధులు నందారం జైపాల్ రెడ్డి, ఎండీ బాబా, షేక్ రహీమ్ పాషా వినతిపత్రం అందించారు.  ప్రస్తుత బదిలీల్లో 317 కింద మ్యూచువల్ టీచర్లకు అవకాశం ఇవ్వకపోవడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి10 జిల్లాల నుంచి 33 జిల్లాల వారీగా సర్దుబాటులో భాగంగా కొందరు స్థానికతను కోల్పోయారన్నారు. 

మరికొందరు స్పౌజ్ విడిపోయి ఇతర జిల్లాలకు వెళ్లారన్నారు. 317 జీవోలో ఇలాంటి వారికి న్యాయం చేసేందుకు మ్యూచువల్ ట్రాన్స్ ఫర్ లకు అవకాశం కల్పించి, కొందరు స్పౌజ్ లను ఒకే జిల్లాకు చేర్చారన్నారు.  ఇప్పుడు స్పౌజ్ టీచర్లకు బదిలీల్లో అవకాశం ఇస్తూ.. మ్యూచువల్ లో వచ్చిన వారికి మాత్రం ఇవ్వడంలేదని, ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం పడని తమ సమస్యను పరిష్కరించాలని టీచర్లు కోరారు. 317 బాధిత మ్యూచువల్ టీచర్లకు నష్టం చేయొద్దని వారు విజ్ఞప్తి చేశారు.