న్యూఢిల్లీ: టీమిండియా ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ డొమెస్టిక్ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌కు శుక్రవారం రిటైర్మెంట్ ప్రకటించాడు. కొత్త అవకాశాలను అందుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. తమిళనాడుకు చెందిన 35 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్, 2025–26 సీజన్‌కు ముందు డొమెస్టిక్ క్రికెట్‌లో త్రిపుర జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
టీమిండియా తరఫున 2018, -2019 మధ్య కాలంలో12 వన్డేలు, 9 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. నాగ్‌పూర్‌లో భారత్ ఆడిన 500వ వన్డేలో చివరి ఓవర్ వేయడం, 2019 ప్రపంచకప్‌లో వేసిన తొలి బంతికే వికెట్ తీయడం తన జీవితంలో మర్చిపోలేని క్షణాలని గుర్తుచేసుకున్నాడు. 77 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్‌ల్లో 13 సెంచరీలతో 4253 రన్స్ చేశాడు. 43 వికెట్లు తీశాడు. 112 లిస్ట్–ఎ మ్యాచ్‌లు ఆడిన విజయ్ శంకర్ 2790 రన్స్, 73 వికెట్లు పడగొట్టాడు. 159 టీ20ల్లో 2583 రన్స్‌తో పాటు 38 వికెట్లు తీశాడు.
