నేడు ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఇండియా మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. గెలిస్తే సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే

నేడు ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఇండియా మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. గెలిస్తే సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే
  • నేడు ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఇండియా మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  •     వరుసగా ఆరో విక్టరీపై రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సేన గురి
  •     తీవ్ర ఒత్తిడిలో బట్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సేన
  •     మ. 2 నుంచి స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లైవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

లక్నో:  వన్డే వరల్డ్​కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భిన్నదారుల్లో వెళ్తున్న టీమిండియా, ఇంగ్లండ్ అమీతుమీకి సిద్ధమయ్యాయి. ఓవైపు ఆడిన ఐదు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో గెలిచిన రోహిత్​సేన అజేయంగా ఉండగా.. ఇంకోవైపు డిఫెండింగ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంగ్లిష్​ టీమ్ ఆట అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. ఐదింటిలో ఒక్కటే గెలిచి సెమీఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేసు నుంచి దాదాపు  వైదొలగింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఇక్కడ జరిగే మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టీమిండియా ఫేవరెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బరిలోకి దిగుతోంది. ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పని కూడా పట్టి ఆరో విక్టరీతో సెమీఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెర్తును అధికారికంగా ఖరారు చేసుకోవాలని చూస్తోంది.

గత ఐదు మ్యాచ్​ల్లోనూ టార్గెట్లను సక్సెస్​ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఛేజ్​ చేసిన హోమ్​టీమ్ ఒక్క తప్పటడుగు కూడా వేయలేదు. మరోవైపు ఇంగ్లండ్​ ప్రతీ అడుగూ తడబడుతూనే ఉంది. బజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కొన్నేండ్లుగా దూకుడుగా ఆడుతున్న ఇంగ్లిష్​ టీమ్​ వైట్ బాల్​ క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను క్రియేట్ చేసింది. ఫలితంగా టీ20, వన్డే వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను అందుకుంది. కానీ, బట్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సేన బజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా పిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, వాతావరణంలో బోల్తా కొట్టి అవమానకర రీతిలో టోర్నీ నుంచి నిష్ర్కమించే పరిస్థితి తెచ్చుకుంది. లంక, అఫ్గాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేతిలో కూడా ఓడిన ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ పోరులో ఇండియాకు ఏ మేరకు పోటీ ఇస్తుందో చూడాలి. 

అశ్విన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చాన్స్​ దక్కేనా

గాయపడ్డ స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హార్దిక్ పాండ్యా మరో రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు దూరంగా ఉంటున్నా టీమిండియాలో ఎలాంటి ఇబ్బంది లేదు. బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టాపార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రోహిత్​, గిల్, కోహ్లీ సూపర్​ ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నారు. గత పోరులో పాండ్యా ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆరో బ్యాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వచ్చిన సూర్యకుమార్​ దురదృష్టవశాత్తూ రనౌట్ అవగా.. మరో మిడిలార్డర్ బ్యాటర్​ శ్రేయస్​ అయ్యర్ తన షార్ట్-బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వీక్​నెస్​ను బయటపెట్టాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అదరగొట్టాలని ఈ ఇద్దరూ ఆతృతగా ఉన్నారు. బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బుమ్రా, కుల్దీప్, జడేజా దుమ్మురేపుతుండగా..  ధర్మశాలలో బరిలోకి దిగిన షమీ కివీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై  ఐదు వికెట్లతో అదరగొట్టాడు. ఐదు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో ఆరు వికెట్లు మాత్రమే తీసిన సిరాజ్​ ఒక్కడే జోరందుకోవాల్సి ఉంది. అశ్విన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తీసుకొని ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే ఆప్షన్​ఉన్నా..  తుది జట్టులో ఇద్దరు సీమర్లే ఉంటారు. ఈ నేపథ్యంలో గత మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాంబినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నే కొనసాగించే  చాన్సుంది.  

ఇంగ్లండ్ బ్యాటింగ్ మారేనా

 బట్లర్, బెయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టో, బెన్ స్టోక్స్, లివింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టోన్, హ్యారీ బ్రూక్ రూపంలో వరల్డ్ ​క్లాస్​ హిట్టర్లు అందుబాటులో ఉన్నా ఇంగ్లండ్​ అనూహ్యంగా తడబడుతోంది.  తొలి బాల్​నుంచే హిట్టింగ్​ చేసే టీ20 స్టయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆడాలన్న  ఇంగ్లిష్​ టీమ్​ అప్రోచ్ వన్డేలకు సరిపోవడం లేదు. ఇంగ్లండ్ బ్యాటర్లు పరిస్థితులను మెరుగ్గా అంచనా వేస్తూ, అందుకు తగ్గట్టుగా ఆట తీరును మార్చుకోవాలి. రూట్ మాదిరిగా మిగతా వాళ్లు ఓపిగ్గా బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తేనే ఇంగ్లిష్​ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పుంజుకోగలదు.

ఇక, గాయం కారణంగా స్టార్​ పేసర్​ రీస్ టాప్లీ టోర్నీ నుంచి తప్పుకోవడంతో బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ సమస్యలు మొదలయ్యాయి. అతనిప్లేస్​లో  బ్రైడన్ కార్సే టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వచ్చాడు. మరో పేసర్​ మార్క్ వుడ్ తన మార్కు చూపెట్టడం లేదు. అయితే, స్పిన్నర్లు మొయిన్ అలీ, ఆదిల్ రషీద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఇండియా బ్యాటర్లకు ముప్పు ఉండొచ్చు. ఇక ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సరైన కాంబినేషన్​ను ఎంచుకోవడంలోనూ ఇబ్బంది పడుతోంది. గత రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో రెండు మార్పులు చేసింది. లంకతో పోరులో హ్యారీ బ్రూక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆడలేదు.  లక్నోలో  ఎలాంటి కాంబినేషన్​తో బరిలోకి దిగుతుందో చూడాలి.

పిచ్/ వాతావరణం

లక్నో వికెట్‌‌ సాధారణంగా స్పిన్‌‌కు అనుకూలిస్తుంది. కానీ, ఈ మ్యాచ్‌‌ కోసం ఎర్రమట్టితో కూడిన పిచ్‌‌ సిద్ధం చేశారు. దానిపై పచ్చిక ఉంది. దాంతో సీమర్లకు అనుకూలించే చాన్సుంది. లక్నోలో ఆదివారం మధ్యాహ్నం 31 డిగ్రీల ఎండ ఉండనుంది. సాయంత్రానికి ఐదు డిగ్రీలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. వాన సూచన లేదు.

తుది జట్లు (అంచనా)
ఇండియా:  రోహిత్ (కెప్టెన్), గిల్, కోహ్లీ, అయ్యర్, రాహుల్ (కీపర్​),  సూర్యకుమార్ , జడేజా,  కుల్దీప్, సిరాజ్/అశ్విన్ షమీ, బుమ్రా.  
ఇంగ్లండ్: బెయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టో, మలన్, రూట్,  స్టోక్స్, బట్లర్ (కెప్టెన్, కీపర్​),  బ్రూక్/అలీ, లివింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టోన్,  వోక్స్,  విల్లీ,  అట్కిన్సన్, ఆదిల్ రషీద్.

ఇంగ్లండ్​తో వన్డేల్లో షమీ 60 బంతుల్లో ఐదుసార్లు బట్లర్‌‌ను ఔట్​ చేశాడు.

శ్రేయస్ అయ్యర్ మరో 69 రన్స్ సాధిస్తే వన్డేల్లో రెండు వేల రన్స్​క్లబ్ లో చేరుతాడు. ఈ మ్యాచ్‌‌లోనే సాధిస్తే వేగంగా 2 వేల రన్స్ చేసిన రెండో ఆటగాడిగా నిలుస్తాడు.