
న్యూఢిల్లీ: కరోనా బ్రేక్ తర్వాత టీమిండియా ఆడబోయే తొలి ఇంటర్నేషనల్ సిరీస్‌పై మరింత క్లారిటీ వచ్చేసింది. ఐపీఎల్ ముగిసిన వెంటనే ఆస్ట్రేలియా వెళ్లనున్న ఇండియా.. రెండు నెలలకు పైగా అక్కడే ఉండనుంది. ఈ లాంగ్ టూర్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) దాదాపు ఖరారు చేసింది. ఇండియా , ఆస్ట్రేలియా మధ్య తొలుత మూడు వన్డేలు, ఆ తర్వాత మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లు జరుగుతాయి. వన్డేలు బ్రిస్బేన్‌లో, టీ20లు అడిలైడ్‌లో ఉంటాయి. ఈ వైట్ బాల్ సిరీస్‌లు పూర్తయ్యాక.. అడిలైడ్ వేదికగా జరిగే డే అండ్ నైట్ మ్యాచ్‌తో నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ మొదలవనుంది. ఫారిన్‌లో ఇండియా ఆడే ఈ తొలి పింక్ బాల్ మ్యాచ్ డిసెంబర్ 17–21 మధ్య జరగనుంది. ఆ తర్వాత డిసెంబర్ 26–30 మధ్య జరిగే బాక్సింగ్ డే టెస్ట్ మెల్‌బోర్న్‌లో నిర్వహిస్తారు. ఆ తర్వాత వరుసగా సిడ్నీ(జనవరి 7–11), బ్రిస్బేన్(జనవరి 15–19)లో మిగిలిన టెస్ట్‌లు జరుగుతాయి. మరోపక్క నవంబర్ 10న ఐపీఎల్ ముగిశాక టీమిండియా యూఏఈ నుంచి బ్రిస్బేన్ వెళుతుంది. నవంబర్ 25–30 మధ్యలో వన్డే సిరీస్, డిసెంబర్ 4–8 తేదీల్లో టీ20 సిరీస్ ఆడే చాన్సుంది. ఈ షెడ్యూల్ కు ఇరు దేశాల బోర్డులు అంగీకారం తెలిపాయి. ఆసీసీ లోకల్ గవర్నమెంట్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే సీఏ ఈ షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించనుంది.