క్రైస్ట్‌చర్చ్: విమెన్స్ వరల్డ్‌కప్‌కు ముందు తన రిటైర్మెంట్‌పై సంకేతాలిచ్చిన టీమిండియా కెప్టెన్ మిథాలీ రాజ్ మాట మార్చింది. ఫ్యూచర్ గురించి ఇప్పుడు ఎలాంటి ఆలోచన చేయడం లేదని చెప్పింది. ఇలాంటి సమయంలో రిటైర్మెంట్ నిర్ణయం సరైంది కాదని పేర్కొంది. ‘నా ఫ్యూచర్ పై నిర్ణయం తీసుకునేందుకు గంట సమయం కూడా ఇవ్వట్లేదు. ఓటమికి కారణాలు గుర్తించి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. నా ఫ్యూచర్ గురించి నేనేమీ ఆలోచించట్లేదు. రిటైర్మెంట్ గురించి చెప్పడానికి ఇది సరైన సమయం కాదు. ప్రతి వరల్డ్ కప్ తర్వాత టీమ్‌లో మార్పులు కనిపిస్తాయి. యంగ్‌స్టర్స్ జట్టులోకి రావొచ్చు... లేదా అనుభవం ఉన్న ప్లేయర్లకు ప్లేస్ దక్కొచ్చు. ఇదంతా నిరంతర ప్రక్రియ. కానీ ఇప్పుడే టీమ్ లో మార్పులపై ఆలోచించకూడదు. మేనేజ్‌మెంట్, బోర్డు, సెలెక్టర్లు దీనిపై చర్చిస్తారు. ఈ ఓటమి మమ్మల్ని ఎంతో బాధించింది. కానీ ముందుకెళ్లడం అనివార్యం. మా టీమ్ లో కొందరు మంచి యంగ్ ప్లేయర్లు ఉన్నారు. ఫ్యూచర్ టోర్నీల్లో మంచి పెర్ఫామెన్స్ చేస్తామని అనుకుంటున్నా. కొన్ని డిపార్ట్ మెంట్లలో మేము చాలా మెరుగవ్వాలి. ఓవరాల్ గా మేం బాగానే పెర్ఫామ్ చేశాం’ అని 39 ఏళ్ల మిథాలీ వ్యాఖ్యానించింది.

