వరల్డ్ కప్ పాయే.. ర్యాంకులు వచ్చె.. ఐసీసీ ర్యాంకుల్లో భారత్ హవా

వరల్డ్ కప్ పాయే.. ర్యాంకులు వచ్చె.. ఐసీసీ ర్యాంకుల్లో భారత్ హవా

వరల్డ్ కప్ పాయే.. వరల్డ్ కప్ పాయే.. టోర్నీ ముగిసి 20 రోజులు కావొస్తున్నా ప్రపంచ కప్ ఫైనల్ ఓటమి జ్ఞాపకాలు మాత్రం అభిమానుల మనసులో నుంచి పొవట్లేదు. సొంతగడ్డపై చరిత్ర తిరగరాస్తారు అనుకుంటే.. మన హీరోలు చివరి మెట్టుపై చతికిల పడ్డారు. ఆనాటి నుంచి అభిమానులు క్రికెట్ అంటేనే మొహం చాటేస్తున్నారు. వరల్డ్ కప్‌హే పాయే.. ఈ మ్యాచ్ లెంత! మనోళ్లు ఎలానూ వీటిలో ఇరగదీస్తారు! అంటూ పట్టించుకోవట్లేదు. అది సరైన పద్ధతి కాదు.. గతం గతః.. చేదు ఘటనలు మరిచిపోవాలి. మన క్రికెటర్లకు మనమే బలం. మన వాళ్లు గొప్ప ప్రదర్శనే చేశారు.. కాకపోతే ఆ ఒక్కరోజు అదృష్టం ఆసీస్ పక్షాన ఉంది.. అందువల్లే వారు విజయం సాధించారు.

వరల్డ్ కప్ పోయినా మన జట్టు, మన క్రికెటర్లు మాత్రం ఐసీసీ ర్యాంకుల్లో ఇరగదీశారు.  టీమ్ ర్యాంకింగ్స్‌లో వన్డే, టెస్ట్, టీ20 మూడు ఫార్మాట్లలోనూ భారత జట్టు అగ్రస్థానంలో ఉంది. ఇక ప్లేయర్  ర్యాంకింగ్స్‌లో ఫార్మాట్(వన్డే, టెస్ట్, టీ20లు)ను బట్టి సూర్యకుమార్ యాదవ్, రవి బిష్ణోయ్, శుభ్ మాన్ గిల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా నెంబర్. 1 ర్యాంకుల్లో ఉన్నారు. 

ఐసీసీ ర్యాంకుల్లో భారత్ హవా 

  • వన్డేల్లో నెంబర్.1 జట్టు: టీమిండియా(తరువాత ఆస్ట్రేలియా, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా)
  • టెస్టుల్లో నెంబర్.1 జట్టు: టీమిండియా(తరువాత ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా)   
  • టీ20ల్లో నెంబర్.1 జట్టు: టీమిండియా (తరువాత ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా)

ప్లేయర్ ర్యాంకింగ్స్

  • టీ20ల్లో నెంబర్.1 బ్యాటర్: సూర్యకుమార్ యాదవ్
  • టీ20ల్లో నెంబర్.1 బౌలర్: రవి బిష్ణోయ్
  • వన్డేల్లో నెంబర్.1 బ్యాటర్: శుభ్ మాన్ గిల్
  • టెస్టుల్లో నెంబర్.1 బౌలర్: రవిచంద్రన్ అశ్విన్
  • టెస్టుల్లో నెంబర్.1 ఆల్‌రౌండర్: రవీంద్ర జడేజా