- మనమీద మనకు నమ్మకం ఉన్నప్పుడే విజయం
- టీమిండియా క్రికెటర్ అరుంధతి రెడ్డి
అల్వాల్, వెలుగు: కలలు కనడం కాదు.. కష్టపడితేనే ఫలితం వస్తుందని టీమిండియా మహిళా క్రికెటర్ అరుంధతి రెడ్డి విద్యార్థులకు సూచించారు. వరల్డ్‌కప్ విజయం తర్వాత మేడ్చల్‌జిల్లాలోని కౌకుర్జడ్పీ హైస్కూల్‌ను మంగళవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా అరుంధతి రెడ్డి మాట్లాడుతూ.. తన తల్లిని ఆదర్శంగా తీసుకుని, ఆమె ప్రోత్సాహంతోనే ఉన్నత శిఖరాలకు చేరుకున్నానని చెప్పారు. మనమీద మనకు నమ్మకం ఉన్నప్పుడే విజయం చేరువవుతుందన్నారు. తాను కౌకుర్లోనే పుట్టి, ఇక్కడే క్రికెట్ ఓనమాలు నేర్చుకున్నానని గుర్తుచేసుకున్నారు.
తానూ తప్పకుండా కౌకుర్ విద్యార్థులను క్రీడల్లో ఎంకరేజ్ చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం అరుంధతి రెడ్డిని స్కూల్ టీచర్లు ఘనంగా సన్మానించారు. ప్రిన్సిపల్ మురళీ కృష్ణమూర్తి, ప్రదీప్ రెడ్డి, పీడీ పారిజాత, అరుంధతి తల్లి భాగ్యరెడ్డి, అమ్మమ్మ, పాఠశాల కౌకుర్ ఇన్‌చార్జ్ భారతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
