యంగ్‌‌‌‌‌‌‌‌ క్రికెటర్‌‌‌‌‌‌‌‌ చికిత్స కోసం రాహుల్ రూ. 31 లక్షల విరాళం

యంగ్‌‌‌‌‌‌‌‌ క్రికెటర్‌‌‌‌‌‌‌‌ చికిత్స కోసం రాహుల్ రూ. 31 లక్షల విరాళం

బెంగళూరు: ఇండియా డ్యాషింగ్‌‌‌‌‌‌‌‌ క్రికెటర్‌‌‌‌‌‌‌‌ లోకేశ్‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌ మంచి మనసు చాటుకున్నాడు. ముంబైకి చెందిన వరాద్‌‌‌‌‌‌‌‌ అనే 11 ఏళ్ల యంగ్‌‌‌‌‌‌‌‌ క్రికెటర్‌‌‌‌‌‌‌‌ ప్రాణాలు కాపాడాడు. అరుదైన రక్త సంబంధ వ్యాధి చికిత్స కోసం  రూ. 31 లక్షలు విరాళంగా అందించాడు. ఐదో తరగతి చదువుతున్న వరాద్‌‌‌‌‌‌‌‌ అప్లాస్టిక్‌‌‌‌‌‌‌‌ అనీమియా అనే వ్యాధి బారిన పడ్డాడు. బోన్‌‌‌‌‌‌‌‌ మ్యారో ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ప్లాంట్‌‌‌‌‌‌‌‌తోనే పూర్తిగా నయం చేయొచ్చని,  దీనికి రూ. 35 లక్షలు ఖర్చవుతుందని  డాక్టర్లు అతని పేరెంట్స్‌‌‌‌‌‌‌‌కు తెలిపారు.

అంత డబ్బు లేకపోవడంతో  వాళ్లు గివ్‌‌‌‌‌‌‌‌ఇండియా అనే ఆర్గనైజేషన్‌‌‌‌‌‌‌‌ ద్వారా ఫండ్‌‌‌‌‌‌‌‌ రైజింగ్‌‌‌‌‌‌‌‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విషయం తెలుసుకున్న రాహుల్‌‌‌‌‌‌‌‌ అందించిన సాయంతో కుర్రాడికి సర్జరీ చేయించారు. సర్జరీ సక్సెస్‌‌‌‌‌‌‌‌ అవడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన కేఎల్​..  వరాద్‌‌‌‌‌‌‌‌ పూర్తిగా కోలుకొని క్రికెటర్‌‌‌‌‌‌‌‌ అవ్వాలన్న తన కలను సాకారం చేసుకోవాలని ఆకాంక్షించాడు.