టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కరోనా నుంచి కోలుకున్నారు. ఇటీవలే వైరస్ సోకడంతో ఆసియా కప్ కు దూరమవుతారని అనుకున్నారు. ఈ నెల 23న కరోనా బారిన పడిన ద్రవిడ్... బీసీసీఐ బోర్డు వైద్యుల పర్యవేక్షణలో ఆయన చికిత్స తీసుకున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ.. ఆయన హోం ఐసోలేషన్ లో ఉన్నారు. మరోసారి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఆయనకు నెగటివ్ తేలింది. శనివారం సాయంత్రం దుబాయ్ విమానం ఎక్కారు. టీమిండియా జట్టుతో చేరిపోయారు. ఆసియా కప్ లో దాయాదితో కీలక మ్యాచ్ కు ముందు ద్రవిద్ చేరడంతో టీమిండియా సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.
ఆసియా కప్ అయినా ఈ మెగా టోర్నీలో అందరి దృష్టి ఇండియా–పాకిస్తాన్పోరుపైనే ఉంది. ఈ పోరు కోసం అభిమానులంతా వేయి కండ్లతో ఎదురు చూస్తున్నారు. ఆదివారం రాత్రి గ్రూప్–ఎలో జరిగే ఇండో–పాక్ పోరుతోనే అసలు ఆట మొదలవనుంది. దాయాదుల పోరు అనగానే ఇరు జట్ల ఆటగాళ్లు గెలుపు కాంక్షతో పట్టుదలగా ఉంటారు. కాబట్టి హోరాహోరీ పోరు జరగొచ్చు.
తుది జట్లు (అంచనా)
ఇండియా : రోహిత్ (కెప్టెన్), రాహుల్, కోహ్లీ, సూర్య కుమార్, హార్దిక్ పాండ్యా, పంత్ / దినేశ్, జడేజా, భువనేశ్వర్, అవేశ్ ఖాన్/ అశ్విన్, చహల్, అర్ష్‌దీప్.
పాకిస్తాన్ : బాబర్ (కెప్టెన్), రిజ్వాన్, ఫఖర్, ఆసిఫ్ అలీ, ఇఫ్తికర్, కుష్దిల్ షా, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్ / ఉస్మాన్ ఖాదిర్, షానవాజ్ దహాని / మహ్మద్ హస్నైన్, హారిస్ రవూఫ్, నసీమ్ షా.
Team India Head Coach Rahul Dravid has reached Dubai for Asia Cup 2022 and has joined the team in the hotel after testing negative for COVID-19: Sources
— ANI (@ANI) August 28, 2022
India will take on Pakistan today evening in Asia Cup 2022
(Photo source: BCCI) pic.twitter.com/R4uvIkLwyr
