తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం

తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం

హరారే : జింబాబ్వే టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇండియా టీమ్‌‌‌‌‌‌‌‌ విజయంతో ఆరంభించింది. బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌లో శుభ్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌ గిల్‌‌‌‌‌‌‌‌ (72 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 10 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌‌‌‌‌తో 82 నాటౌట్‌‌‌‌‌‌‌‌), శిఖర్‌‌‌‌‌‌‌‌ ధవన్‌‌‌‌‌‌‌‌ (113 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 9 ఫోర్లతో 81 నాటౌట్‌‌‌‌‌‌‌‌) దంచికొట్టడంతో.. గురువారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా 10 వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. దీంతో మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌లో 1–0 లీడ్‌‌‌‌‌‌‌‌లో నిలిచింది. టాస్‌‌‌‌‌‌‌‌ ఓడి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు దిగిన జింబాబ్వే 40.3 ఓవర్లలో 189 రన్స్‌‌‌‌‌‌‌‌కే ఆలౌటైంది. రెజిస్‌‌‌‌‌‌‌‌ చకబ్వా (35) టాప్‌‌‌‌‌‌‌‌ స్కోరర్‌‌‌‌‌‌‌‌. ఇండియా బౌలింగ్‌‌‌‌‌‌‌‌ త్రయం దీపక్‌‌‌‌‌‌‌‌ చహర్‌‌‌‌‌‌‌‌ (3/27), ప్రసిధ్‌‌‌‌‌‌‌‌ కృష్ణ (3/50), అక్షర్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌ (3/24) తలా మూడు వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు దిగిన ఇండియా 30.5 ఓవర్లలో 192 రన్స్‌‌‌‌‌‌‌‌ చేసి గెలిచింది. దీపక్‌‌‌‌‌‌‌‌ చహర్‌‌‌‌‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే శనివారం జరుగుతుంది. 

చహర్‌‌‌‌‌‌‌‌.. సూపర్‌‌‌‌‌‌‌‌

గాయంతో ఆరు నెలలు ఆటకు దూరంగా ఉన్న చహర్‌‌‌‌‌‌‌‌.. ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ రీ ఎంట్రీ అదిరిపోయింది. తొలి రెండు ఓవర్లలో లైన్‌‌‌‌‌‌‌‌తో ఇబ్బందిపడినా.. తొలి వికెట్‌‌‌‌‌‌‌‌ తీసిన తర్వాత తన ట్రేడ్‌‌‌‌‌‌‌‌ మార్క్‌‌‌‌‌‌‌‌ స్వింగ్‌‌‌‌‌‌‌‌తో అదరగొట్టాడు. బ్యాక్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ లెంగ్త్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌కు ఓపెనర్‌‌‌‌‌‌‌‌ ఇన్నోసెంట్‌‌‌‌‌‌‌‌ కయా (4), ఫుల్లర్‌‌‌‌‌‌‌‌ లెంగ్త్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌కు తడివాన్షి మరుమాని (8), ఓ అద్భుతమైన లేట్‌‌‌‌‌‌‌‌ స్వింగ్‌‌‌‌‌‌‌‌తో వెస్లీ మదెవరె (5)ను పెవిలియన్‌‌‌‌‌‌‌‌కు చేర్చాడు. మధ్యలో హైదరాబాదీ సిరాజ్‌‌‌‌‌‌‌‌.. సీన్‌‌‌‌‌‌‌‌ విలియమ్స్‌‌‌‌‌‌‌‌ (1)ను ఔట్‌‌‌‌‌‌‌‌ చేయడంతో జింబాబ్వే 31/4తో కష్టాల్లో పడింది.  ఈ దశలో కెప్టెన్‌‌‌‌‌‌‌‌ చకబ్వా నిలకడగా ఆడాడు. దీపక్‌‌‌‌‌‌‌‌ స్పెల్‌‌‌‌‌‌‌‌ ముగిసిన తర్వాత  ప్రసిధ్‌‌‌‌‌‌‌‌, అక్షర్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌ లయ అందుకున్నారు. స్వల్ప వ్యవధిలో ప్రసిధ్‌‌‌‌‌‌‌‌..  సికిందర్‌‌‌‌‌‌‌‌ రజా (12), రైన్‌‌‌‌‌‌‌‌ బుర్ల్‌‌‌‌‌‌‌‌ (11)ను వెనక్కి పంపితే, మధ్యలో అక్షర్‌‌‌‌‌‌‌‌.. చకబ్వా, ల్యూక్‌‌‌‌‌‌‌‌ జోంగ్వి (13)ను ఔట్‌‌‌‌‌‌‌‌ చేసి భారీ స్కోరుకు అడ్డుకట్ట వేశాడు. అయితే లోయర్‌‌‌‌‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌లో బ్రాడ్‌‌‌‌‌‌‌‌ ఇవాన్స్‌‌‌‌‌‌‌‌ (33 నాటౌట్‌‌‌‌‌‌‌‌), రిచర్డ్‌‌‌‌‌‌‌‌ నగరవా (34) వేగంగా ఆడారు.  ఫోర్లు, సిక్సర్లతో తొమ్మిదో వికెట్‌‌‌‌‌‌‌‌కు 70 రన్స్‌‌‌‌‌‌‌‌ జోడించడంతో జింబాబ్వే ఆ మాత్రం స్కోరైనా చేసింది. చివర్లో ప్రసిధ్‌‌‌‌‌‌‌‌, అక్షర్‌‌‌‌‌‌‌‌ వరుస ఓవర్లలో నగరవా, నైయుచి (8)ని ఔట్‌‌‌‌‌‌‌‌ చేసి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌కు తెరదించారు. 

ఇద్దరూ.. ఇద్దరే

పెద్ద టార్గెట్‌‌‌‌‌‌‌‌ కాకపోవడంతో.. గిల్‌‌‌‌‌‌‌‌, ధవన్‌‌‌‌‌‌‌‌ ఏమాత్రం ఇబ్బందిపడలేదు. స్టార్టింగ్‌‌‌‌‌‌‌‌లో కొద్దిగా నెమ్మదించినా.. తర్వాత దంచికొట్టారు. సీమర్స్‌‌‌‌‌‌‌‌, స్లో బౌలర్ల బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో ధవన్‌‌‌‌‌‌‌‌ తన సిగ్నేచర్‌‌‌‌‌‌‌‌ స్క్వేర్‌‌‌‌‌‌‌‌ కట్స్‌‌‌‌‌‌‌‌, లాఫ్టెడ్‌‌‌‌‌‌‌‌ షాట్స్‌‌‌‌‌‌‌‌తో అలరించాడు. తొలి 30 బాల్స్‌‌‌‌‌‌‌‌ మెల్లగా ఆడినా గిల్‌‌‌‌‌‌‌‌ ఆ తర్వాత సూపర్‌‌‌‌‌‌‌‌ స్ట్రోక్స్‌‌‌‌‌‌‌‌తో చెలరేగాడు. సైడ్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద వికెట్‌‌‌‌‌‌‌‌ షాట్స్‌‌‌‌‌‌‌‌తో పాటు మదెవరె బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో డీప్‌‌‌‌‌‌‌‌ మిడ్‌‌‌‌‌‌‌‌ వికెట్‌‌‌‌‌‌‌‌ మీదుగా సిక్సర్‌‌‌‌‌‌‌‌ కూడా కొట్టాడు. ఇద్దరూ కలిసి 19 బౌండ్రీలు బాది విజయాన్ని అందించారు. ఈ క్రమంలో ధవన్‌‌‌‌‌‌‌‌ వన్డేల్లో 6500 రన్స్‌‌‌‌‌‌‌‌ చేసిన  ఇండియన్‌‌‌‌‌‌‌‌ పదో బ్యాటర్‌‌‌‌‌‌‌‌గా రికార్డులకెక్కాడు. 

సంక్షిప్త స్కోర్లు

జింబాబ్వే: 40.3 ఓవర్లలో 189 (చకబ్వా (35, నగరవా 34, ఇవాన్స్‌‌‌‌‌‌‌‌ 33*, చహర్‌‌‌‌‌‌‌‌ 3/27).

ఇండియా: 30.5 ఓవర్లలో 192 (గిల్‌‌‌‌‌‌‌‌ 82*, ధవన్‌‌‌‌‌‌‌‌ 81*)