లత మంగేష్కర్ కన్నమూత.. నల్లబ్యాండ్‌లు ధరించిన టీమిండియా

లత మంగేష్కర్ కన్నమూత.. నల్లబ్యాండ్‌లు ధరించిన టీమిండియా

భారత గాన కోకిల లతమంగేష్కర్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ముంబై బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచారు. దీంతో యావత్ భారతదేశం లతాకు ఘన నివాళి అర్పించింది. రాజకీయ, సినీ ప్రముఖులంతా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక భారత క్రికెట్ జట్టు సైతం లతాజీ మృతి పట్ల తమ సంతాపం తెలిపింది. భారతరత్న లతా మంగేష్కర్‌కు నివాళులర్పించేందుకు ఈరోజు చేతులకు నల్ల బ్యాండ్‌లు ధరించారు భారత క్రికెట్ ప్లేయర్స్. 

లత మంగేష్కర్ దాదాపు అన్ని భాషాల్లో కూడా పాటలు పాడి ప్రేక్షకుల్ని సంపాదించుకున్నారు. మీనా కుమారి మొదలుకొని కత్రినా కైఫ్ వరకు లత తన కెరీర్‌లో.. ప్రతి తరానికి పాటలు పాడారు. లతా మంగేష్కర్ 30 వేలకు పైగా పాటలు పాడారు. లతా మంగేష్కర్ ప్రపంచంలోని 36 భాషల్లో 30 వేలకు పైగా పాటలు పాడారు. 1991లోనే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఆమె పేరు నమోదైంది. లతా మంగేష్కర్‌కు 1969లో పద్మభూషణ్, 1989లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 1999లో పద్మవిభూషణ్, 2001లో భారతరత్న, 2008లో భారతదేశ స్వాతంత్య్ర 60వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ అవార్డు‌తో లతను సన్మానించారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 1984లో ఆమె పేరిట ఒక అవార్డును ప్రారంభించింది, దానికి 'లతా మంగేష్కర్ అవార్డు' అని పేరు పెట్టారు.