నేడు అఫ్గాన్‌‌‌‌తో ఇండియా ఢీ

నేడు అఫ్గాన్‌‌‌‌తో ఇండియా ఢీ

దుబాయ్‌‌: ఆసియాకప్‌‌ ఫైనల్‌‌ రేసు నుంచి వైదొలిగిన టీమిండియా గురువారం జరిగే తమ సూపర్‌‌4 చివరి మ్యాచ్‌‌ అఫ్గానిస్తాన్‌‌తో పోటీ పడనుంది. ఈ మ్యాచ్‌‌లో గెలిచి ఊరట దక్కించుకోవడంతో పాటు విజయంతో   టోర్నీని ముంగించాలని చూస్తోంది. పాకిస్తాన్‌‌ చేతిలో అఫ్గాన్‌‌ ఓడిపోవడంతో ఈ మ్యాచ్‌‌కు ఎలాంటి  ప్రాధాన్యత లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో  టీ20 ప్రపంచకప్‌‌ ప్రిపరేషన్స్‌‌లో టీమిండియా ఈ పోరును ప్రయోగాలకు వేదికగా మార్చుకోవచ్చు.

ఈ టోర్నీలో ఇప్పటిదాకా పెద్దగా ప్రభావం చూపని ఓపెనర్‌‌ కేఎల్‌‌ రాహుల్‌‌, రిషబ్‌‌ పంత్‌‌ ఆఖరాటలో అయినా సత్తా చాటాలని ఫ్యాన్స్‌‌ ఆశిస్తున్నారు.  గత రెండు మ్యాచ్‌‌ల్లో విఫలమైన పంత్‌‌, దీపక్‌‌ హుడాను పక్కనబెట్టి దినేశ్‌‌ కార్తీక్‌‌ను ఆడించడంతో పాటు దీపక్‌‌ చహర్‌‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలున్నాయి. ఇక, చిన్న టార్గెట్‌‌ను కాపాడుకునే ప్రయత్నంలో పాకిస్తాన్‌‌ను వణికించిన అఫ్గాన్‌‌ను తక్కువగా అంచనా వేసే పరిస్థితి లేదు. మరి, రోహిత్‌‌సేన విజయంతో టోర్నీని ముగుస్తుందో లేదో చూడాలి.