కోహ్లీ ఆడకపోతే ఎలా?

కోహ్లీ ఆడకపోతే ఎలా?
  • టీమిండియా, ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దెబ్బేనన్న నాసిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కూ ఇబ్బందే..

చెన్నై: 
వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తొలి రెండు టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల నుంచి వైదొలిగిన టీమిండియా స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విరాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోహ్లీ.. ఇప్పుడు ఏకంగా సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొత్తానికే దూరంగా ఉండేలా కనిపిస్తోంది. అయితే ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మిగతా మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లోనూ విరాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆడకపోవడం ఇండియాతో పాటు సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కూడా దెబ్బేనని ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాజీ కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాసిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హుస్సేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అభిప్రాయపడ్డాడు. ప్రతి ఒక్కరు పర్సనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మద్దతివ్వాల్సిన అవసరం ఉన్నా.. ఏదో ఓ దశలో టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా పట్టించుకోవాలన్నాడు. విరాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేకపోవడం వల్ల ఇండో–ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కళ తప్పుతుందన్నాడు. ‘ప్రస్తుతానికి కోహ్లీ అందుబాటులో ఉండే అంశంపై క్లారిటీ లేదు.

టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రకటిస్తే తప్ప అతను ఆడేది లేనిది తెలియదు. విరాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కనీసం రెండు టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైనా ఆడతాడని భావించాం. కానీ చివరి మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకూ అందుబాటులో ఉండటం లేదనే ఊహాగానాలు వస్తున్నాయి. దీనివల్ల టీమిండియాతో పాటు సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కూడా పెద్ద దెబ్బ. ఇండియా, ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చాలా ప్రత్యేకత ఉంది. తొలి రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు చాలా రవసత్తరంగా, ఆకర్షణీయంగా సాగాయి. కాబట్టి ఇలాంటి సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కోహ్లీ లేకపోవడమనేది చాలా పెద్ద లోటు’ అని హుస్సేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నాడు. 

ఫ్యామిలీ కూడా ఇంపార్టెంటే..

15 ఏళ్లుగా ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆడుతున్న విరాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫ్యామిలీ కూడా ఇంపార్టెంటేనని హుస్సేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మద్దతిచ్చాడు. అయితే కుటుంబంతో కొంత సమయం గడిపిన తర్వాత మళ్లీ ఆటలోకి వస్తే బాగుంటుందన్నాడు. సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొత్తానికే దూరంగా ఉంటాడని వస్తున్న వార్తలే నిరాశపరుస్తున్నాయన్నాడు. ‘విరాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాంటి ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్యామిలీతో పాటు ఆటను కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అతని ఆటను కోరుకుంటారు. గత కొన్నేళ్లుగా అండర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోహ్లీ ఆటను చూస్తున్నాం. 

మరోసారి అలాంటి ఆట కోసమే ఏడాది కాలంగా ఎదురుచూస్తున్నాం. అది ఇప్పుడు లేకపోవడం నిరాశ కలిగిస్తోంది. ఏ మ్యాచైనా ప్రతీ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విరాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాంటి ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉండాలని కోరుకుంటుంది. అతను లేకపోవడం వల్ల టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్థాయి తగ్గుతుంది. ఇది టీమిండియాకు చాలా పెద్ద దెబ్బ అవుతుంది. యువ ఆటగాళ్లకు కూడా నష్టం కలుగుతుంది’ అని హుస్సేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యాఖ్యానించాడు. 

మూడో టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బుమ్రా ఆడతాడా?

ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మిగతా మూడు టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంపిక మొత్తం పేసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రీత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బుమ్రా చుట్టే తిరుగుతున్నది. ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దృష్టిలో పెట్టుకుని థర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (రాజ్​కోట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)లో బుమ్రాకు రెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇస్తారని తెలుస్తోంది. దాంతో పాటు ఈ పిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేసర్లకు అనుకూలం కాదని నివేదికలూ వస్తున్నాయి. అయితే ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెలవాలంటే బుమ్రా టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉండాలన్నది మరో వాదన. తొలి రెండు టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో కలిపి 57.5 ఓవర్లు బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన బుమ్రా 15 వికెట్లు తీశాడు. కాబట్టి వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇంజ్యురీ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా అతనికి విశ్రాంతి ఇస్తేనే బాగుంటుందని సెలెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్గాలు తెలిపాయి. అయితే ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాటర్లు మన స్పిన్నర్లను దీటుగా ఎదుర్కొంటున్న నేపథ్యంలో బుమ్రా  టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంటే బాగుంటుందని ఆలోచిస్తున్నారు. ఇప్పటికే కోహ్లీ లేకపోవడంతో వైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్న బుమ్రా.. రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అండగా నిలుస్తాడని భావిస్తున్నారు. ఓవరాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బుమ్రా విషయంలో సెలెక్టర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందే.