డబ్ల్యూటీసీ ఫైనల్‌‌కు 15 మందితో టీమ్‌‌

డబ్ల్యూటీసీ ఫైనల్‌‌కు 15 మందితో టీమ్‌‌
  • విహారి, షమీ, ఉమేశ్‌ రిటర్న్​
  • సిరాజ్​కు అవకాశం
  • డబ్ల్యూటీసీ ఫైనల్‌‌కు 15 మందితో టీమ్‌‌ ప్రకటన

సౌతాంప్టన్‌‌:  ఆస్ట్రేలియా టూర్‌‌ సందర్భంగా  గాయపడ్డ హైదరాబాదీ హనుమ విహారి, సీనియర్‌‌ పేసర్లు మహ్మద్‌‌ షమీ, ఉమేశ్‌‌ యాదవ్‌‌ మళ్లీ బరిలోకి దిగబోతున్నారు. న్యూజిలాండ్‌‌తో శుక్రవారం నుంచి జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్‌‌కు ఐసీసీ ప్రొటోకాల్‌‌ ప్రకారం ఇండియా ప్రకటించిన 15 మందితో కూడిన టీమ్‌‌లో ఈ ముగ్గురికి చోటు దక్కింది. బ్రిస్బేన్‌‌ టెస్టు హీరో శార్దూల్‌‌ ఠాకూర్‌‌ ప్లేస్‌‌ వెటరన్‌‌ స్పీడ్‌‌స్టర్‌‌ ఉమేశ్‌‌కు మేనేజ్‌‌మెంట్‌‌ చాన్స్‌‌ ఇచ్చింది. శార్దూల్‌‌తో పాటు మయాంక్‌‌ అగర్వాల్‌‌, వాషింగ్టన్‌‌ సుందర్‌‌, ఇంగ్లండ్‌‌తో హోమ్‌‌ సిరీస్‌‌ హీరో అక్షర్‌‌ పటేల్‌‌కు ఫైనల్‌‌15లో అవకాశం రాలేదు. అలాగే,  టీమిండియా ఇంట్రా స్క్వాడ్‌‌ ప్రాక్టీస్‌‌ మ్యాచ్‌‌లో విరాట్‌‌ కోహ్లీ అపోజిషన్‌‌  టీమ్‌‌కు కెప్టెన్‌‌గా వ్యవహరించిన సీనియర్‌‌ బ్యాట్స్‌‌మన్‌‌ కేఎల్‌‌ రాహుల్‌‌ను కూడా తీసుకోలేదు. గాయం నుంచి కోలుకున్న రాహుల్‌‌ ప్రాక్టీస్ మ్యాచ్‌‌లో టచ్‌‌లోనే కనిపించినా.. ఆస్ట్రేలియా టూర్‌‌లోని  ఫస్ట్‌‌ చాయిస్‌‌ ప్లేయర్లకే మేనేజ్‌‌మెంట్ మొగ్గు చూపినట్టు అర్థం అవుతోంది.  కోహ్లీ కెప్టెన్సీ అందుకున్న తర్వాత ఫైనల్‌‌ ఎలెవన్‌‌ సెలక్షన్‌‌లో టీమ్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ స్పష్టమైన పాలసీ అనుసరిస్తోంది. ఫస్ట్‌‌ చాయిస్‌‌తో పాటు రిజర్వ్‌‌ ప్లేయర్లు బాగా ఆడుతున్నప్పటికీ.. సీనియర్‌‌ ప్లేయర్లకు గాయం అయితేనే వాళ్లకు చాన్స్‌‌ ఇస్తోంది.  ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్‌‌ టెస్టులో హాఫ్‌‌ సెంచరీతో పాటు ఏడు వికెట్లు తీసి సిరీస్‌‌ విజయంలో కీలక పాత్ర పోషించిన శార్దూల్‌‌ కంటే ఉమేశ్‌‌కు ప్రాధాన్యత ఇచ్చింది. ఆఫ్‌‌ స్పిన్నర్‌‌ అశ్విన్‌‌తో పాటు స్పిన్‌‌ ఆల్‌‌రౌండర్‌‌ రవీంద్ర జడేజా ఉండటంతో అక్షర్‌‌ పటేల్‌‌కు ప్లేస్‌‌ లేకుండా పోయింది. అలాగే, ఓపెనర్లుగా రోహిత్‌‌, శుభ్‌‌మన్‌‌ గిల్‌‌కు మేనేజ్‌‌మెంట్‌‌ తగినన్ని అవకాశాలు ఇచ్చాకే లోకేశ్‌‌ రాహుల్‌‌, మయాంక్‌‌ అగర్వాల్‌‌ల వంతు రానుంది. వికెట్‌‌ కీపర్‌‌కు సబ్‌‌స్టిట్యూట్‌‌గా కీపర్‌‌నే ఎంచుకోవాలన్న ఐసీసీ రూల్‌‌ నేపథ్యంలో వృద్ధిమాన్‌‌ సాహాను ఫైనల్‌‌ ఎలెవన్‌‌లోకి తీసుకున్నారు.

ఇండియా టీమ్‌‌: గిల్‌‌, రోహిత్‌‌, పుజారా, కోహ్లీ (కెప్టెన్‌‌),  రహానె, పంత్‌‌ (కీపర్‌‌), విహారి, సాహా (కీపర్‌‌), అశ్విన్‌‌, జడేజా, షమీ, బుమ్రా, ఇషాంత్‌‌, ఉమేశ్, సిరాజ్‌‌.

న్యూజిలాండ్‌‌ టీమ్‌‌: కేన్‌‌ విలియమ్సన్‌‌ (కెప్టెన్‌‌), టామ్‌‌ బ్లండెల్‌‌, ట్రెంట్‌‌ బౌల్ట్‌‌, కాన్వే, గ్రాండ్‌‌హోమ్‌‌, మాట్‌‌ హెన్రీ, కైల్‌‌ జెమీసన్‌‌, టామ్‌‌ లాథమ్‌‌, హెన్రీ నికోల్స్‌‌, అజాజ్‌‌ పటేల్‌‌, టిమ్‌‌ సౌథీ, రాస్‌‌ టేలర్‌‌, నీల్‌‌ వాగ్నర్‌‌, బీజే వాట్లింగ్‌‌, విల్‌‌ యంగ్‌‌

విలియమ్సన్‌‌‌‌ రెడీ
గాయం కారణంగా ఇంగ్లండ్‌‌‌‌తో సెకండ్‌‌‌‌ టెస్ట్‌‌‌‌కు దూరంగా ఉన్న న్యూజిలాండ్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌ కేన్‌‌‌‌ విలియమ్సన్‌‌‌‌ డబ్ల్యూటీసీ ఫైనల్లో తమ టీమ్‌‌‌‌ను నడిపించేందుకు అందుబాటులో ఉంటాడని కివీస్‌‌‌‌ హెడ్‌‌‌‌ కోచ్‌‌‌‌ గ్యారీ స్టెడ్‌‌‌‌ చెప్పాడు. ఈ మ్యాచ్‌‌‌‌కు 15 మందితో కూడిన టీమ్‌‌‌‌ను అతను వెల్లడించాడు. కేన్‌‌‌‌తో పాటు బ్యాంక్‌‌‌‌ ఇంజ్యురీ కారణంగా ఇంగ్లండ్‌‌‌‌తో రెండో మ్యాచ్‌‌‌‌లో ఆడని  కీపర్‌‌‌‌ బీజే  వాట్లింగ్‌‌‌‌ను కూడా టీమ్‌‌‌‌లోకి తీసుకున్నారు.