వరల్డ్ కప్పుపై కన్నేసిన టీమిండియా 

వరల్డ్ కప్పుపై కన్నేసిన టీమిండియా 
  • టీ20 వరల్డ్ కప్పుకు టీమిండియా ప్రిపరేషన్ షురూ
  • నేడు ఇంగ్లండ్‌తో కోహ్లీసేన ఫస్ట్ టీ20 
  • ఓపెనర్గా రాహుల్.. నాలుగో నంబర్‌లో శ్రేయస్!

పేరుకే ఇండియా, ఇంగ్లండ్ మధ్య సిరీస్..! కానీ ఇరుజట్ల టార్గెట్ మాత్రం టీ20 వరల్డ్ కప్ పైనే..! ఒకరిదేమో ప్రిపరేషన్స్... మరొకరిదేమో ఇక్కడి కండీషన్స్కు అలవాటు పడటం..! ఈ నేపథ్యంలో షార్ట్ ఫార్మాట్ మెగా ఈవెంట్కు సన్నాహకంగా భావి స్తున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు రంగం సిద్ధమైంది..! వరల్డ్ లార్జెస్ట్ స్టేడియం మొతెరాలో నేడే రెండు జట్ల మధ్య ఫస్ట్ ఫైట్.. ! ఐపీఎల్ యంగ్స్టర్లతో టీమిండియా... వరల్డ్ క్లాస్ బిగ్ హిట్టర్లతో  ఇంగ్లండ్..! పోటీ, పోరాటం, ర్యాంకింగ్స్లో టాప్–2లో ఉన్న ఈ రెండు జట్ల మధ్య సిక్సర్ల జాతర ఖాయంగా కనిపిస్తున్నా.. గెలుపు బోణీ ఎవరిదనేది ఆసక్తికరంగా మారింది..!! 

అహ్మదాబాద్: టెస్ట్ సిరీస్లో అద్బుతం చేసిన ఇండియా.. ఇప్పుడు షార్ట్ ఫార్మాట్ సిరీస్కు రెడీ అయ్యింది. సీనియర్లు, కుర్రాళ్ల మేళవింపుతో సరికొత్త కాంబినేషన్స్ను టెస్ట్ చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శుక్రవారం జరిగే ఫస్ట్ టీ20లో టీమిండియా.. పటిష్టమైన ఇంగ్లండ్తో అమీతుమీ తేల్చుకోనుంది. అక్టోబర్లో టీ20 వరల్డ్కప్ జరగనున్న తరుణంలో ఇరుజట్లు ఈ సిరీస్ను సన్నాహకంగా భావిస్తున్నాయి. అందులో భాగంగా బలమైన కోర్ గ్రూప్ను ఎంచుకోవాలని కెప్టెన్ విరాట్ కోహ్లీ టార్గెట్గా పెట్టుకున్నాడు. ఈ ఫార్మాట్లో ఇంగ్లండ్ కంటే మెరుగైన ప్రత్యర్థి లేకపోవడంతో.. అవసరమైతే ఈ సిరీస్లో ప్రయోగాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అయితే ఐపీఎల్ యంగ్ స్టార్లందరూ టీమ్లోకి రావడంతో ఫైనల్ ఎలెవన్ లో ఎవర్ని ఆడించాలన్న దానిపై  కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. కొన్ని ప్లేస్లకు అటోమెటిక్ చాయిసెస్ ఉన్నా.. కీలకమైన నాలుగో ప్లేస్లో ఎవర్ని ఆడిస్తారో ఇంకా మిస్టరీగానే ఉంది. ఓవరాల్గా ఎక్కువ ప్రత్యామ్నాయాలను దృష్టిలో పెట్టుకుని ఫైనల్ టీమ్ను ఎంచుకోవాలని రవి అండ్ కో భావిస్తోంది.

రాహుల్ ఆగయా...
ఓపెనింగ్ స్లాట్ కోసం పోటీపడుతున్న రాహుల్, ధవన్లపై మేనేజ్మెంట్ ఓ అంచనాకు వచ్చేసింది. టీ20 వరల్డ్కప్ను దృష్టిలో పెట్టుకుని ఈ ఫార్మాట్లో రోహిత్కు తోడుగా రాహుల్తో ఓపెనింగ్ చేయించాలని డిసైడ్ అయ్యింది. క్రికెటింగ్ లాజిక్, స్కిల్స్ ప్రకారం ఈ నిర్ణయం సరైందిగానే అనిపిస్తున్నా.. గ్లోబల్ ఈవెంట్స్ అంటేనే చెలరేగిపోయే ధవన్ను పక్కనపెట్టడం కొద్దిగా కష్టమనిపిస్తోంది. రాహుల్తో పోలిస్తే శిఖర్కు ఎక్స్పీరియెన్స్ కూడా ఎక్కువే. లెఫ్ట్–రైట్ కాంబినేషన్ ప్రయోజనం కూడా ఉంటుంది. అయితే కెప్టెన్ కోహ్లీ మాత్రం రాహుల్కే  ఓటేశాడు. ఇక నాలుగో ప్లేస్ కోసం యంగ్స్టర్స్ సూర్యకుమార్, శ్రేయస్ అయ్యర్ మధ్య గట్టి పోటీ ఉంది. ఇప్పుడున్న స్ట్రాటజీ ప్రకారం శ్రేయస్కే చాన్స్ ఎక్కువగా ఉంది. ఐదో ప్లేస్లో హిట్టర్గా కీపర్ రిషబ్ పంత్ ఉండనే ఉన్నాడు. ఆల్రౌండర్గా హార్దిక్ ప్లేస్ ఖాయం. జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీతో బౌలింగ్లోనూ టీమిండియా కొత్తగా ఆలోచించాల్సిన  టైమ్ వచ్చేసింది. తొడ గాయం నుంచి కోలుకున్న భువనేశ్వర్కు డైరెక్ట్ ఎంట్రీ ఉంది.  అతనికి తోడుగా శార్దూల్, సైనీ బరిలోకి దిగొచ్చు. రిస్ట్ స్పిన్నర్ చహల్ స్పిన్ అటాక్ను లీడ్ చేస్తాడు. స్పిన్ ఆడటంలో ఇంగ్లండ్కు ఇబ్బంది కాబట్టి ముగ్గురు స్పిన్నర్ల స్ట్రాటజీని ఫాలో అయితే.. సుందర్, అక్షర్ పటేల్ తుది జట్టులోకి వచ్చినా ఆశ్చర్యం లేదు. అప్పుడు  సైనీ, శార్దూల్లో ఒకరికే చాన్స్ దక్కుతుంది. దీపక్ చహర్కు మ్యాచ్ ప్రాక్టీస్ లేదు కాబట్టి అతను ఇప్పుడే ప్లేస్ను ఆశించే పరిస్థితి లేదు. మొత్తానికి ఫస్ట్ మ్యాచ్ తర్వాత కొత్త ప్లేయర్లపై మేనేజ్మెంట్ ఓ అవగాహనకు రానుంది. 

స్టోక్స్‌తో డేంజర్
షార్ట్ బాల్ ఫార్మాట్లో ఇంగ్లండ్ నంబర్వన్ ర్యాంక్లో ఉంది. ఆ టీమ్ ప్లేయర్లు కూడా అదే స్థాయిలో ఉన్నారు. ముఖ్యంగా మల్టీ స్కిల్డ్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్తో ఇండియాకు అతిపెద్ద ప్రమాదం పొంచి ఉంది. టీ20 ఫార్మాట్ స్పెషలిస్ట్లు సామ్ కరన్, మొయిన్ అలీ ఏ క్షణంలోనైనా మ్యాచ్ను మలుపు తిప్పగల సమర్థులు. జేసన్ రాయ్, బట్లర్ శుభారంభం ఇస్తారా? మలన్, బెయిర్స్టో, మోర్గాన్ మిడిలార్డర్ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తారా? అన్నది తేలాల్సి ఉన్నా.. టీమిండియా పేస్–స్పిన్ కాంబినేషన్ ముందు వీళ్లు ఎంత మేరకు నిలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పేసర్ ఆర్చర్ మోచేతి గాయంతో బాధపడుతుండటం విజిటింగ్ టీమ్కు ప్రతికూలాంశం. అతని ప్లేస్లో మార్క్వుడ్ తుది జట్టులోకి రావొచ్చు. జోర్డాన్ సెకండ్ పేసర్గా బాధ్యతలు పంచుకోనున్నాడు. స్పిన్నర్లుగా రషీద్, అలీ కీలకంకానున్నారు. టెస్ట్ సిరీస్ పరాభవాన్ని మర్చిపోవాలంటే ఈ సిరీస్లో శుభారంభం చేయాలని ఇంగ్లండ్ చాలా పట్టుదలగా కనిపిస్తోంది. మరి ఆ స్థాయిలో విజృంభిస్తుందా? లేదా? అన్నది చూడాలి. 

  • ఇప్పటివరకు ఇరుజట్లు 14 టీ20లు ఆడితే చెరో ఏడుసార్లు గెలిచాయి. అయితే లాస్ట్ ఐదు మ్యాచ్ల్లో మాత్రం టీమిండియాదే పైచేయి. 
  • లాస్ట్ 8 ఇన్నింగ్స్లో మలన్-మోర్గాన్ మధ్య రెండు సెంచరీ, రెండు హాఫ్ సెంచరీ పార్ట్నర్షిప్స్ ఉన్నాయి. యావరేజ్ 66.37 కాగా, పర్ ఓవర్ స్కోరు 11.46.
  • ఇంటర్నేషనల్ టీ20ల్లో 3 వేల రన్స్ కంప్లీట్ చేసిన తొలి క్రికెటర్గా నిలిచేందుకు  విరాట్ కోహ్లీకి అవసరమైన రన్స్. 

జట్లు (అంచనా)
ఇండియా: కోహ్లీ (కెప్టెన్), రోహిత్, రాహుల్, శ్రేయస్, పంత్ (కీపర్), హార్దిక్, అక్షర్ / సుందర్, శార్దూల్, భువనేశ్వర్, చహల్, సైనీ.
ఇంగ్లండ్: మోర్గాన్ (కెప్టెన్), రాయ్, బట్లర్(కీపర్), మలన్, బెయిర్స్టో, స్టోక్స్, మొయిన్ అలీ, కరన్, జోర్డాన్, ఆర్చర్ / 
మార్క్ వుడ్, ఆదిల్ రషీద్.

పిచ్, వాతావరణం
బ్యాటింగ్ ఫ్రెండ్లీ  వికెట్. జనవరిలో సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో స్పిన్నర్లకు అనుకూలించింది. ఇక్కడ ఆడిన ఏడు మ్యాచ్ల్లో ఐదుసార్లు ఛేజింగ్ చేసిన టీమే నెగ్గింది. రాత్రి మ్యాచ్ కాబట్టి మంచు ప్రభావం ఉంటుంది. వర్షం ముప్పు లేదు.