ఫైటర్‌‌‌‌ టీజర్‌‌‌‌ విడుదల

ఫైటర్‌‌‌‌ టీజర్‌‌‌‌ విడుదల

హృతిక్ రోషన్, దీపికా పదుకొణె జంటగా తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ ‘ఫైటర్‌‌‌‌’. అనిల్ కపూర్ కీలకపాత్ర పోషిస్తున్నారు. వార్‌‌‌‌, పఠాన్‌‌ లాంటి యాక్షన్‌‌ మూవీస్‌‌తో మెప్పించిన సిద్ధార్థ్‌‌ ఆనంద్ దీనికి దర్శకుడు. శుక్రవారం ఈ మూవీ టీజర్‌‌‌‌ను విడుదల చేశారు. యాక్షన్ లవర్స్ ను ఆకట్టుకునేలా టీజర్‌‌‌‌ను కట్ చేశారు. ముఖ్యంగా ఆకాశంలో ఫైటర్‌‌‌‌ జెట్స్‌‌తో హృతిక్, దీపిక చేసిన విన్యాసాలు ప్రేక్షకులకు గూస్‌‌బంప్స్ తెప్పించేలా ఉన్నాయి.

ఆ తర్వాత చూపించిన లవ్, రొమాన్స్, యాక్షన్, ఎమోషన్ సీన్స్‌‌ ఆకట్టుకున్నాయి. టీజర్ చివరలో ‘సుజలాం సుఫలాం’ అంటూ బ్యాక్‌గ్రౌండ్‌‌లో జాతీయ గీతం వినిపిస్తుండగా.. ఒక చేత్తో జాతీయ జెండా పట్టుకుని ఫైటర్ జెట్ నుంచి హృతిక్ బయటకు రావడం టీజర్‌‌‌‌లో హైలైట్‌‌గా నిలిచింది. వచ్చే ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25న సినిమా విడుదల కానుంది.

ఈఏడాది రిపబ్లిక్‌‌ డేకు సిద్ధార్థ్ ఆనంద్ తీసిన ‘పఠాన్‌‌’ విడుదలై బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. దీంతో సేమ్ డేట్‌‌కు వస్తున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా ఎయిర్‌‌‌‌ ఫోర్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఫస్ట్ ఇండియన్ ఏరియల్ యాక్షన్ మూవీ ఇదంటున్నారు మేకర్స్.