వేలల్లో వస్తున్నాయ్​ జాబ్స్‌‌!

V6 Velugu Posted on Sep 13, 2021

  • హైరింగ్ చేపడుతున్న టెక్‌‌ కంపెనీలు

కరోనా కట్టుబాట్లు లేకపోవడం, ఎకానమీ పుంజుకోవడం,పెద్ద దేశాల నుంచి పాజిటివ్‌‌‌‌ సంకేతాలు రావడంతో ఐటీ, సోషల్‌‌‌‌ మీడియా, ఫైనాన్షియల్‌‌‌‌ కంపెనీలు పెద్ద ఎత్తున జాబ్స్‌‌‌‌ ఇవ్వడానికి రెడీ అవుతున్నాయి. ఈ ఏడాది వేలాది జాబ్స్ ఇస్తామని ఐబీఎం, టీసీఎస్‌‌‌‌, కూ వంటి కంపెనీలు ప్రకటించాయి. ఫ్రెషర్స్‌‌‌‌తోపాటు ఫైనర్‌‌‌‌ ఇయర్‌‌‌‌ చదివే డిగ్రీ స్టూడెంట్స్‌‌‌‌ కూడా అప్లై చేసుకోవచ్చునన్నాయి. టీసీఎస్​ ఈసారి మహిళలకు ఎక్కువ జాబ్స్ ఇవ్వనుంది.​ 

న్యూఢిల్లీ: కరోనా అడ్డంకులను దాటుకొని సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌ ఇండస్ట్రీ జెట్‌‌‌‌స్పీడ్‌‌‌‌తో దూసుకెళ్తోంది. మహమ్మారి విసిరిన చాలెంజ్‌‌‌‌లను తట్టుకొని ముందుకుసాగుతోంది. కంపెనీలు బిజినెస్‌‌‌‌లను విస్తరిస్తున్నాయి. ఇందుకోసం భారీ సంఖ్యలో ఫ్రెషర్లకు, ఎక్స్‌‌‌‌పీరియెన్సెడ్‌‌‌‌ ఫ్రొఫెషనల్స్‌‌‌‌కు జాబ్స్ ఇస్తున్నాయి. మనదేశంలోని అతిపెద్ద సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌ కంపెనీల్లో ఒకటైన టీసీఎస్‌‌‌‌ త్వరలో భారీ రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌ డ్రైవ్‌‌‌‌ను చేపడతామని ప్రకటించింది. ఈసారి మహిళలకు ఎక్కువ ఇంపార్టెన్స్‌‌‌‌ ఇస్తామని పేర్కొంది. వ్యక్తిగత ఇబ్బందుల వల్ల గతంలో జాబ్స్‌‌‌‌ వదిలేసిన వారికి మరోసారి చాన్స్‌‌‌‌ ఇస్తామని తెలిపింది. కనీసం రెండేళ్లు అనుభవం ఉన్న వారిని తిరిగి తీసుకోనుంది. ఈ ఏడాది జూన్‌‌‌‌లోనే టీసీఎస్‌‌‌‌ 20 వేల మందికి జాబ్స్‌‌‌‌ ఇచ్చింది. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య ఐదు లక్షలకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు 40 వేల మంది ఫ్రెషర్లకు అవకాశం ఇవ్వనుంది. ఆసక్తి ఉన్న వాళ్లు టీసీఎస్‌‌‌‌ కెరీర్‌‌‌‌ పోర్టల్‌‌‌‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎస్‌‌‌‌క్యూఎల్‌‌‌‌ సర్వర్ డీబీఏ, లైనక్స్ అడ్మినిస్ట్రేటర్, నెట్‌‌‌‌వర్క్ అడ్మిన్, మెయిన్‌‌‌‌ఫ్రేమ్ అడ్మిన్, ఆటోమేషన్ టెస్టింగ్, పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ కన్సల్టెంట్, ఆంగ్యులర్‌‌‌‌ జేఎస్‌‌‌‌, ఒరాకిల్ డీబీఏ, సిట్రిక్స్ అడ్మినిస్ట్రేటర్, జావా డెవలపర్, డాట్‌‌‌‌నెట్ డెవలపర్, ఆండ్రాయిడ్ డెవలపర్, ఐఓఎస్‌‌‌‌ డెవలపర్, విండోస్ అడ్మిన్, పైథాన్ డెవలపర్, పైలట్ డెవలపర్ వంటి స్కిల్స్‌‌‌‌ ఉన్న వాళ్లు జాబ్స్‌‌‌‌కు ప్రయత్నించవచ్చని టీసీఎస్​ సీనియర్​ ఎగ్జిక్యూటివ్​ ఒకరు వివరించారు. 

ఐబీఎంలో ఎంట్రీ లెవల్ జాబ్స్
సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌ సేవలు అందించే మల్టీనేషనల్‌‌‌‌ కంపెనీ ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్ (ఐబీఎం) కార్పొరేషన్ మనదేశంలోని ఆఫీసుల కోసం ఫ్రెష్‌‌‌‌ గ్రాడ్యుయేట్లను నియమించుకోనుంది. ఈ  గ్లోబల్ టెక్ కంపెనీ ముంబై, పుణే, ఢిల్లీ , కోల్‌‌‌‌కతా, చెన్నై సహా పలు సిటీల కోసం అసోసియేట్ సిస్టమ్ ఇంజనీర్లను తీసుకోనుంది. తాజా గ్రాడ్యుయేట్లను సాఫ్ట్‌‌‌‌వేర్ ఇంజనీర్లుగా నియమిస్తుంది. వీళ్లు అప్లికేషన్‌‌‌‌ డిజైన్, రైటింగ్, టెస్టింగ్, డీబగ్గింగ్ కోడ్‌‌‌‌లు తయారు చేయాలి.  ఇతర సాఫ్ట్‌‌‌‌వేర్ ప్లాట్‌‌‌‌ఫారమ్‌‌‌‌లపైనా పని చేయాలి.  కేండిడేట్లకు జావా, పైథాన్, నాడ్.జేఎస్ వంటి భాషలలో కోడింగ్ తెలిసి ఉండాలి. సాఫ్ట్‌‌‌‌వేర్ డెవలప్‌‌‌‌మెంట్ లైఫ్ సైకిల్ కాన్సెప్ట్‌‌‌‌లపై అవగాహన ఉండాలి. ఇది ఎంట్రీ లెవల్ జాబ్ కాబట్టి, గ్రాడ్యుయేషన్ డిగ్రీ పొందిన కేండిడేట్స్ జాబ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరంలో ఉన్న వాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు.  సీఎస్ లేదా ఇతర సెమీ ఐటీ బ్రాంచులలో బీఈ/ ఎంటెక్  లేదా ఎమెస్సీ/ ఎంసీయే చదివి ఉండాలి. ఐబీఎంలో జాబ్ కోసం దరఖాస్తు చేయడానికి ఆరు లేదా అంతకంటే ఎక్కువ సీజీపీఏ అవసరం. అంతేకాకుండా, ఐబీఎం  కోసం పనిచేయాలనుకునే వాళ్లకు ఇంటర్‌‌‌‌ పర్సనల్, రైటింగ్, స్పోకెన్ స్కిల్స్ తప్పనిసరి.  టెక్నికల్ ఆర్కిటెక్చర్‌‌‌‌ను డిఫైన్ చేయగలగాలి. ఎనలైజ్, రివ్యూ చేయాలి.

మరికొన్ని కంపెనీలు కూడా..
రాబోయే ఐదు సంవత్సరాలలో 10 వేల మందికి పైగా ఉద్యోగులను నియమించుకుంటామని ఆడిట్,  కన్సల్టింగ్ సంస్థ ప్రైస్ వాటర్స్ కూపర్ (పీడబ్ల్యూసీ ) ప్రకటించింది. ఈసారి సైన్స్‌‌‌‌‌‌‌‌, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌‌‌‌‌‌‌‌,  మ్యాథ్స్‌‌‌‌‌‌‌‌ (స్టెమ్) స్టూడెంట్లకు ఎక్కువ అవకాశాలు ఇస్తామని ప్రకటించింది.  కస్టమర్ ఎంగేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ సొల్యూషన్స్‌‌‌‌‌‌‌‌ అందించే గ్లోబల్‌‌‌‌‌‌‌‌ కంపెనీ (24)7.ఏఐ ఇండియాలో ఐదు వేల మందికి జాబ్స్‌‌‌‌‌‌‌‌ ఇస్తామని ప్రకటించింది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ సైట్‌‌‌‌‌‌‌‌ కోసం 1,500 మందిని తీసుకుంటుంది. దీంతో ఈ సిటీలో ఎంప్లాయిస్‌‌‌‌‌‌‌‌ సంఖ్య 3,500లకు చేరుకుంటుంది.  ఐవేర్ బ్రాండ్ లెన్స్‌‌‌‌‌‌‌‌కార్ట్ తన టెక్  డేటా సైన్స్ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌ కోసం రాబోయే సంవత్సరాల్లో రెండువేల మందికి జాబ్స్‌‌‌‌‌‌‌‌ ఇవ్వనుంది. వీటిలో డేటా సైంటిస్టులు, బిజినెస్ ఎనలిస్టు, డేటా ఇంజనీర్‌‌‌‌‌‌‌‌ జాబ్స్ ఎక్కువగా ఉంటాయి. బెంగుళూరు, ఢిల్లీ,  హైదరాబాద్ స్టోర్ల మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ కోసం 1,500 మంది తీసుకుంటుంది. టెక్నాలజీ టీమ్‌‌‌‌‌‌‌‌ కోసం 100 మంది ఇంజనీర్లకు ఆఫర్‌‌‌‌‌‌‌‌ లెటర్లు ఇస్తుంది. 300 మందికిపైగా ఉద్యోగులు సప్లై చెయిన్, మానుఫ్యాక్చరింగ్ కోసం పనిచేస్తారు. 100 మందికి కార్పొరేట్ సంబంధిత బాధ్యతలు ఇస్తామని కంపెనీ సీనియర్​ ఆఫీసర్​ ఒకరు వివరించారు. 

Tagged business, corona, jobs, Tech companies,

Latest Videos

Subscribe Now

More News