IND vs AUS: బుమ్రా ఇన్.. నితీష్ ఔట్: ఆస్ట్రేలియాతో తొలి టీ20.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!

IND vs AUS: బుమ్రా ఇన్.. నితీష్ ఔట్: ఆస్ట్రేలియాతో తొలి టీ20.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!

ఆస్ట్రేలియాతో జరగనున్న తొలి టీ20కు భారత జట్టు సిద్ధమవుతోంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని టీమిండియా ఆసీస్ తో కట్టిన సవాలుకు సై అంటుంది. ఆసియా కప్ టైటిల్ గెలిచిన తర్వాత టీమిండియా ఆడిన తొలి టీ20 సిరీస్ ఇదే. వన్డే సిరీస్ ఓడిపోయినా టీ20 గెలిచి కంగారులకు షాక్ ఇవ్వాలని టీమిండియా భావిస్తోంది. 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి టీ20 బుధవారం (అక్టోబర్ 29) జరగనుంది. కాన్ బెర్రాలోని మనూక ఓవల్ ఈ మ్యాచ్ కు ఆతిధ్యమివ్వనుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఎలాంటి జట్టుతో బరిలోకి దిగుతుందో ఆసక్తికరంగా మారింది. తొలి టీ20కి ఇండియా తుది జట్టు ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం..   

అభిషేక్ శర్మతో పాటు శుభమాన్ గిల్ ఇన్నింగ్స్ ను ఆరంభించనున్నారు. అభిషేక్ ఏడాదికాలంగా టీ20 క్రికెట్ భారత రెగ్యులర్ ఓపెనర్. గిల్ జట్టుకు వైస్ కెప్టెన్. స్పెషలిస్ట్ ఓపెనర్ ఉండడంతో శాంసన్ ఓపెనర్ గా వచ్చే అవకాశాలు దాదాపు లేవు. మూడో స్థానంలో కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆడతాడు. గత కొంతకాలంగా సూర్య విఫలమవుతున్నా.. ఒక్కసారి ఫామ్ లోకి వస్తే ఎంత ప్రమాదకరమో అందరికీ తెలుసు. ఆసియా కప్ ఫైనల్ హీరో తిలక్ వర్మ స్థానానికి ఎలాంటి ఢోకా లేదు.

ఐసీసీ ర్యాంకింగ్స్ లో రెండో స్థానంలో ఈ హైదరాబాదీ కుర్రాడు మూడో స్థానంలో తనను తాను నిరూపించుకున్నాడు.  గత ఏడాది సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో వరుసగా రెండు సెంచరీలు బాది ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు. సఫారీలతో జరిగిన 4 మ్యాచ్‌ల్లో టీ 20 సిరీస్ 198 స్ట్రైక్‌రేట్‌తో 280 పరుగులు చేశాడు. నాలుగో స్థానంలో తిలక్ బ్యాటింగ్ కు వస్తాడు. ఐదో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫినిషర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సంజు శాంసన్ ఆడతాడు. గాయం కారణంగా రేపు జరగనున్న మ్యాచ్ కు నితీష్ ఆడే అవకాశాలు కనిపించడం లేదు.    

►ALSO READ | AB de Villiers: ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చే న్యూస్.. కోహ్లీ రిటైర్మెంట్‌పై నోరు విప్పిన డివిలియర్స్

ఆరో స్థానంలో హార్థిక్ పాండ్య లేకపోవడంతో శివమ్ దూబే ఆరో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చే అవకాశాలున్నాయి. ఏడో స్థానంలో ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ బరిలోకి దిగడం ఖాయం.స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కు నిరాశ తప్పేలా లేదు. కుల్దీప్ కంటే సుందర్ ను ఆడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముగ్గురు స్పెషలిస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్ తో పాటు హర్షిత్ రానా ప్లేయింగ్ 11 లో ఆడనున్నారు. 

ఇండియా ప్లేయింగ్ 11 (అంచనా): 

అభిషేక్ శర్మ, శుభమాన్ గిల్ (వైస్ కెప్టెన్) , తిలక్ వర్మ , సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), అక్షర్ పటేల్, సంజు శాంసన్, శివమ్ దూబే, వాషింగ్ టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రానా, అర్షదీప్ సింగ్