AB de Villiers: ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చే న్యూస్.. కోహ్లీ రిటైర్మెంట్‌పై నోరు విప్పిన డివిలియర్స్

AB de Villiers: ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చే న్యూస్.. కోహ్లీ రిటైర్మెంట్‌పై నోరు విప్పిన డివిలియర్స్

టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ 2027 వన్డే వరల్డ్ కప్ ఆడతాడో లేదో అనే విషయంలో క్లారిటీ లేదు. ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ లోనూ కోహ్లీ తొలి రెండు వన్డేల్లో డకౌటై తీవ్రంగా నిరాశపరిచాడు. అయితే మూడో వన్డేలో హాఫ్ సెంచరీ చేసి టచ్ లోకి వచ్చాడు. వరల్డ్ కప్ కు మరో రెండున్నరేళ్ల సమయం ఉంది. ప్రస్తుతం కోహ్లీ వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడడంతో అతడి ఫామ్ పై ఆందోళన ఉంది. ఈ సమయంలో కోహ్లీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెబుతూ డివిలియర్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. 2027 వన్డే వరల్డ్ కప్ కోహ్లీ ఆడతాడని కన్ఫర్మ్ చేశాడు. 

కోహ్లీకి డివిలియర్స్ కు మధ్య ఎలాంటి అనుబంధం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు కోహ్లీతో టచ్ లో ఉండే డివిలియర్స్ కు ఈ స్టార్ బ్యాటర్ గురించిన మొత్తం విషయాలు తెలుస్తాయి. తాజాగా కోహ్లీపై డివిలియర్స్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కోహ్లీ కెరీర్ గురించి  డివిలియర్స్ ఒక పోడ్ కాస్ట్ లో మాట్లాడుతూ ఇలా అన్నాడు.."నా అభిప్రాయం ప్రకారం 2027 ప్రపంచ కప్ కోహ్లీ కెరీర్ లో చివరిది అవుతుంది. ఐపీఎల్ విషయానికి వస్తే ఈ  కథ భిన్నంగా ఉంటుంది. కోహ్లీ మూడు నుంచి ఐదు సంవత్సరాలు ఐపీఎల్ ఆడొచ్చు. ఐపీఎల్ మూడు నెలల్లో సిద్ధం కావొచ్చు. కానీ వరల్డ్ కప్ నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగే వరల్డ్ కప్ కు సిద్ధం కావడం కష్టమైన పని". అని డివిలియర్స్ అన్నాడు. 

వన్డే ప్రపంచ కప్ 2027 లో జరుగుతుంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఈ టోర్నీకి ఆతిధ్యమిస్తున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించడంతో వన్డే ఫార్మాట్ కు కూడా గుడ్ బై చెబుతాడనే  ఊహాగానాలు వచ్చాయి. అయితే వాటిలో నిజం లేదని కోహ్లీ స్పష్టం చేశాడు. 2023 వన్డే వరల్డ్ కప్ లో సొంతగడ్డపై ఇండియా.. ఆస్ట్రేలియాపై ఓడిపోయింది. ఈ టోర్నీ మొత్తం అద్భుతంగా రాణించిన విరాట్.. 761 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి కోహ్లీతో పాటు టీమిండియాను తీవ్రంగా కలిచి వేసింది.