ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ20 సిరీస్ కు రంగం సిద్ధమైంది. 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి టీ20 బుధవారం (అక్టోబర్ 29) జరగనుంది. కాన్ బెర్రాలోని మనూక ఓవల్ ఈ మ్యాచ్ కు ఆతిధ్యమివ్వనుంది. సొంతగడ్డపై మ్యాచ్ జరుగుతుండడంతో ఈ సమరంలో ఆస్ట్రేలియా ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. వన్డే సిరీస్ గెలుచుకొని ఫుల్ జోష్ లో ఉన్న కంగారూల జట్టు అదే ఊపులో టీ20 సిరీస్ గెలవాలనే పట్టుదలతో కనిపిస్తోంది. మరోవైపు టీమిండియా టీ20 క్రికెట్ లో తాము ఎంత ప్రమాదకర జట్టో నిరూపించడానికి సిద్ధంగా ఉంది.
వన్డే సిరీస్ తో పోలిస్తే టీ20 సిరీస్ లో ఇరు జట్లలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇండియా స్క్వాడ్ విషయానికి వస్తే ఆసియా కప్ కు ఎంపిక చేసిన 15 మంది స్క్వాడ్ ను అలాగే ఉంచారు. కొత్తగా ఆల్ రౌండర్ నితీష్ కుమార్ కు జట్టులో చోటు కల్పించారు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా శుభ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్ గా జట్టులో కొనసాగనున్నారు. టీ20 వరల్డ్ కప్ కు ముందు ఇండియాకు ఆస్ట్రేలియాతో సిరీస్ సవాలుగుగా మారనుంది. వన్డే సిరీస్ కు రెస్ట్ తీసుకున్న బుమ్రా టీ20 సిరీస్ కు అందుబాటులో ఉంటాడు.
ఆస్ట్రేలియా జట్టు విషయానికి వస్తే శుక్రవారం (అక్టోబర్ 24) క్రికెట్ ఆస్ట్రేలియా నలుగురు కొత్త ప్లేయర్లను స్క్వాడ్ లోకి చేర్చుకుంది. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న మ్యాక్స్ వెల్ ఆసీస్ జట్టులోకి చాలా నెలల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ విధ్వంసక వీరుడు చివరి మూడు మ్యాచ్ లకు మాత్రమే అందుబాటులో ఉంటాడు. మ్యాక్స్ వెల్ తో పాటుఫాస్ట్ బౌలర్ బెన్ డ్వార్షుయిస్ (నాలుగు, ఐదు మ్యాచ్ లకు).. వికెట్ కీపర్ జోష్ ఫిలిప్ (అన్ని గేమ్‌లు), యువ పేసర్ మహ్లి బియర్డ్‌మాన్ (మూడు, నాలుగు, ఐదు) స్క్వాడ్ లో ఎంపికయ్యారు. స్టార్ ఫాస్ట్ బౌలర్ జోష్ హాజిల్‌వుడ్ తొలి రెండు టీ20 మ్యాచ్ లు మాత్రమే ఆడనున్నాడు. సీన్ అబాట్ మొదటి మూడు మ్యాచ్ లకు మాత్రమే అందుబాటులో ఉంటాడు.
భారత టీ20 జట్టు:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రానా, సంజు శాంసన్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్
►ALSO READ | మాతో పాటే ఇంటికి తీసుకుపోతం: అయ్యర్ గాయంపై సూర్య బిగ్ అప్డేట్
ఆస్ట్రేలియా టీ20 స్క్వాడ్:
మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్ (ఆటలు 1–3), జేవియర్ బార్ట్‌లెట్, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్ (ఆటలు 4–5), నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్ (ఆటలు 1–2), మహ్లి బియర్డ్‌మాన్ (ఆటలు 3–5), ట్రావిస్ హెడ్, జోష్ ఫిలిప్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, మిచెల్ ఓవెన్, మాట్ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.
5 మ్యాచ్ ల సిరీస్ షెడ్యూల్:
అక్టోబర్ 29: మొదటి టీ20 - మనుకా ఓవల్, కాన్‌బెర్రా
అక్టోబర్ 31: రెండవ టీ20 - MCG, మెల్బోర్న్
నవంబర్ 2: 3వ టీ20 - బెల్లెరివ్ ఓవల్, హోబర్ట్
నవంబర్ 6: 4వ టీ20 - గోల్డ్ కోస్ట్ స్టేడియం
నవంబర్ 8: 5వ టీ20 - ది గబ్బా, బ్రిస్బేన్
టైమింగ్, లైవ్ స్ట్రీమింగ్, టెలికాస్టింగ్ వివరాలు:
భారత కాలమాన ప్రకారం ఐదు టీ20 మ్యాచ్ లు మధ్యాహ్నం 1:45 గంటలకు జరనున్నాయి. 1:15 గంటలకు టాస్ వేస్తారు.
లైవ్ టెలికాస్ట్: స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ ఐదు టీ20 మ్యాచ్ లను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.
లైవ్ స్ట్రీమింగ్: జియో సినిమా యాప్, వెబ్‌సైట్ లో ప్రత్యక్ష ప్రసారం అందుబాటులో ఉంటుంది.
