BAN vs WI: పాపం బంగ్లా ప్లేయర్ బ్యాడ్ లక్.. కష్టపడి సిక్సర్ కొట్టినా ఔటిచ్చారు

BAN vs WI: పాపం బంగ్లా ప్లేయర్ బ్యాడ్ లక్.. కష్టపడి సిక్సర్ కొట్టినా ఔటిచ్చారు

వెస్టిండీస్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన తొలి టీ20లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సోమవారం (అక్టోబర్ 27) చట్టోగ్రామ్ వేదికగా   రెహమాన్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో బంగ్లా ప్లేయర్  టాస్కిన్ అహ్మద్ కు ఊహించని విధంగా దురదృష్టం వెక్కిరించింది. ఛేజింగ్ చేస్తున్న ఇన్నింగ్స్ 20 ఓవర్లో బంగ్లా విజయానికి చివరి మూడు బంతుల్లో 17 పరుగులు అవసరం. మూడు సిక్సర్లు కొడితే బంగ్లా గెలిచే ఛాన్స్ ఉంది. ఈ ఓవర్ లో షెపర్డ్ వేసిన నాలుగో బంతిని తస్కిన్ అహ్మద్ డీప్ మిడ్ వికెట్ గా భారీ సిక్సర్ కొట్టాడు. ఈ సిక్సర్ తర్వాత బంగ్లా ఆసలు సజీవంగా ఉన్నాయని భావించారు. 

ఈ సమయంలోనే ట్విస్ట్ చోటు చేసుకుంది. సిక్సర్ కొట్టకముందే అహ్మద్ హిట్ వికెట్ గా ఔటయ్యాడు. భారీ షాట్ కొట్టే క్రమంలో ఈ బంగ్లా ప్లేయర్ కాలు వికెట్ తగిలింది. ఈ విషయం తెలియక తస్కిన్ సెలెబ్రేట్ చేసుకోవడం.. ఆ తర్వాత హిట్ వికెట్ ఔట్ అని తెలియడంతో షెపర్డ్ నవ్వడం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అహ్మద్ ఔట్ పై నెటిజన్స్ సెటైర్స్ వేస్తున్నారు. చూసుకోవాలి కదా బ్రో.. అని కొందరు కామెంట్స్ చేస్తుంటే.. నీ కష్టం పగోడికి కూడా రాకూడదు అని మరికొందరు అంటున్నారు. ఇంకొందరైతే ఇంత బ్యాడ్ లక్ ఉంటే ఏం చేయలేమని కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి భారీ సిక్సర్ కొట్టినా ఫలితం లేకుండా పోయింది. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఆతిధ్య బంగ్లాదేశ్ పై వెస్టిండీస్ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. కెప్టెన్ షాయ్ హోప్ 46 పరుగులు చేసి నిలిస్తే.. పవర్ హిట్టర్ పావెల్ 28 బంతుల్లోనే నాలుగు సిక్సర్లతో 44 పరుగులు చేశాడు. ఓపెనర్లు అలిక్ అథనాజ్ (34), బ్రాండన్ కింగ్ (33) పర్వాలేదనిపించారు. 166 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 149 పరుగులకు ఆలౌటైంది. విండీస్ బౌలర్లలో హోల్డర్, సీల్స్ తలో మూడు వికెట్లు తీసుకొని గెలుపులో కీలక పాత్ర పోషించారు. పావెల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.