మైండ్ బ్లాంక్ : వారం రోజుల్లో ఐటీ కంపెనీలు తీసేసిన ఉద్యోగాలు ఇవే..

మైండ్ బ్లాంక్ : వారం రోజుల్లో ఐటీ కంపెనీలు తీసేసిన ఉద్యోగాలు ఇవే..

2024లో టెక్ పరిశ్రమలో కోత కొనసాగుతూనే ఉంది. 2024లో ఇప్పటివరకూ 32వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపేశాయి.  ఈ వారం రోజుల్లో అయితే   పలు దిగ్గజ కంపెనీలు వేలాది మంది ఉద్యోగులను తొలగించాయి. 

గ్లోబల్ నెట్‌వర్కింగ్ కంపెనీ సిస్కో సిస్టమ్స్ 4 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. 2023 నాటికి సిస్కోలో మొత్తం 85,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. తాజా లేఆఫ్స్ మొత్తం ఉద్యోగుల్లో 5 శాతానికి సమానం.

ప్రముఖ స్పోర్ట్‌ వేర్‌ తయారీ సంస్థ నైక్.. తమ కంపెనీలో పనిచేస్తున్న వారిలో రెండు శాతం మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.  రెండు దశల్లో ఈ ప్రక్రియ ఉంటుందని తెలిపింది. తొలి దశ ఇవాల్టి  ( ఫిబ్రవరి 16) నుంచే ప్రారంభమవుతుందని పేర్కొంది.  ప్రపంచవ్యాప్తంగా నైక్‌లో 83 వేల 700 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

 పారామౌంట్ తన వర్క్‌ఫోర్స్‌ను 3%  అంటే 8 వందల  ఉద్యోగులలను తొలిగించింది.  కంపెనీని ఆదాయ వృద్ధికి తిరిగి తీసుకురావడానికి  ఈ కోతలు అవసరమని ఆ సంస్థ సీఈవో బాబ్ బకిష్ అభిప్రాయపడ్డారు. 

ఇన్‌స్టాకార్ట్  సైతం  ఉద్యోగాల కోతలను ప్రకటించింది. దాదాపు 250 ఉద్యోగాలను తొలగిస్తున్నట్టుగా ప్రకటించింది.  అంటే వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 7% అన్నమాట.  

బ్లాక్‌బెర్రీ టెక్ సంస్థ, ఖర్చులను తగ్గించడానికి సిబ్బందిని తొలగిస్తోంది. 36 ప్రపంచ కార్యాలయ స్థానాల్లో ఆరింటిని మూసివేస్తోంది