నవంబర్లోనూ ఆగని ఐటీ ఉద్యోగుల తొలగింపు

నవంబర్లోనూ ఆగని ఐటీ ఉద్యోగుల తొలగింపు

టెక్ ఉద్యోగులకు లేఆఫ్ టెన్షన్ తప్పడం లేదు. 2023 నవంబర్ లోనూ కొన్ని ప్రముఖ టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను గణనీయంగా తగ్గించాయి. 2022 చివరి భాగం, 2023 ప్రారంభంలో ప్రారంభంలో ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు ముగిశాయని సాఫ్ట్ వేర్ లు చాలామంది అనుకున్నారు. ఆ టైంలో దాదాపు టెక్ దిగ్గజ కంపెనీలు అయిన గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా అమెజాన్ ఇలా చాలా కంపెనీలు  10వేల మంది టెక్ ఉద్యోగులకు షాకిచ్చాయి. అయితే 2023 ప్రారంభం నుంచి కొంచెం తొలగింపు ఉధృతి కొంచెం తగ్గిపోగా..మళ్లీ అక్టోబర్ ప్రారంభం నుంచి ఐటీ కంపెనీలు కోతలను ప్రకటించాయి. ఈ నెలలో కూడా (నవంబర్ ) ఉద్యోగులను లేఆఫ్ ప్రముఖ కంపెనీలు  లేఆఫ్ కొనసాగిస్తున్నాయి. 

నవంబర్లో లేఆఫ్ ప్రకటించిన కంపెనీలు 

ఖర్చు,పొదుపులో భాగంగా.. సిబ్బందిలో 25 శాతం ఉద్యోగులను తగ్గిస్తున్నట్లు NEXT DOOR ది నైబర్ వుడ్ పోకస్డ్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ తన మూడో త్రైమాసిక ఆదాయ నివేదికలో పేర్కొంది. ఇది కష్టమైన నిర్ణయమే అయినప్పటికీ తప్పడం లేదని సీఈవో ప్రకటించారు. 2022లో భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన NFT.. మరోసారి లేఆఫ్ లను ప్రకటించింది.

సెమీ కండక్టర్లు, వైర్ లెస్ టెక్నాలజీ దిగ్గజం QUALCOMM..నవంబర్ లో 1,258 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కంపెనీ అక్టోబర్ లో కూడా భారీగా ఉద్యోగులను తొలగించింది. పునర్నిర్మాణ చర్యలు, వృద్ది, పెట్టుబడులలో వైవిధ్యత కారణంగా మాన్యుపవర్ తగ్గించాల్సి వచ్చిందని తెలిపింది. అయితే 51 వేల మంది ఉద్యోగులున్న మా మ్యాన్ పవర్ లో ఇది కేవలం 2.5 శాతం మాత్రమే అని పేర్కొంది.

సోషల్ మీడియా దిగ్గజం లింక్డిన్..  మరో 668 మంది ఉద్యోగులను తొలగిస్తున్న ట్లు నిన్న (నవంబర్12) ప్రకటించింది. ఫిబ్రవరి, మే తొలగింపుల తర్వాత.. మూడో త్రైమాసికంలో ఇది పెద్ద తొలగింపు రౌండ్ అని తెలిపింది.ప్రతిభ మార్పు, ప్రాధాన్యతగల వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టడం దృష్టి సారించామని.. నవంబర్ తొలగింపులు ... కంపెనీ వర్క్ ఫోర్స్ లో 3 శాతం అని లింక్డన్ ప్రతినిధులు తెలిపారు. 

బ్యాండ్ క్యాంప్.. 

ఎపిక్ గేమ్ లలో ఆడియో డిస్ట్రిబ్యూషన్ ఫ్లాట్ఫారమ్ బ్యాండ్ క్యాంప్..ఎపిక్ 2022లో బ్యాండ్ క్యాంప్ ను కొనుగోలు చేసింది. దీనిని బీ2 బీ మ్యూజిక్ ఫ్లాట్ ఫారమ్ సాంగ్ ట్రాడ్ కు విక్రయిస్తున్నట్లు అక్టోబర్ లో ప్రకటించింది. క్రమంలో ఎపిక్ తన ఉద్యోగులలో 15 శాతం తొలగిస్తున్నట్లు ప్రకటించింది. 

ఏదేమైనా కంపెనీల నిర్వహణ, వృద్ధి, ప్రాధాన్యత ఉన్న రంగాల్లో పెట్టుబడుల కారణంగా..ఆయా ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు షాక్ ఇస్తూనే ఉన్నాయి.. 2023లో దాదాపు ప్రతి నెలా తమ ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో టెకీలు మరింత స్కిల్స్ కు పదును పెట్టడం ద్వారా లేఆఫ్ గండాన్ని తప్పించుకునే అవకాలున్నాయంటున్నారు టెక్ నిపుణులు.