ముంబై: టెక్ మహీంద్రా లిమిటెడ్ లాభం మార్చి 2023 క్వార్టర్లో 27 శాతం తగ్గిపోయింది. ఈ క్వార్టర్లో కంపెనీకి రూ. 1,179.80 కోట్ల లాభం వచ్చింది. అంతకు ముందు ఏడాది క్యూ4 లో కంపెనీ నికర లాభం రూ. 1,637.90 కోట్లు. మార్చి 2023 తో ముగిసిన పూర్తి ఏడాదిలో టెక్ మహీంద్రా లిమిటెడ్ రూ. 5,137.60 కోట్ల నికర లాభం సంపాదించింది. ఇదే కాలానికి టర్నోవర్ మాత్రం రూ. 14,023.70 కోట్లకు పెరిగినట్లు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.
