హెల్మెట్ లేదని ఆపినందుకుహోంగార్డుపై టెకీ దాడి.. అబిడ్స్ లో ఘటన ..ఎస్సై ఫిర్యాదుతో కేసు నమోదు

హెల్మెట్ లేదని ఆపినందుకుహోంగార్డుపై టెకీ దాడి.. అబిడ్స్ లో ఘటన ..ఎస్సై ఫిర్యాదుతో కేసు నమోదు

అబిడ్స్, వెలుగు: హెల్మెట్ లేకుండా బైక్​పై వెళ్తూ ట్రాఫిక్ తనిఖీల్లో దొరికిపోయిన ఓ సాఫ్ట్​వేర్ ఉద్యోగి.. బుద్ధిగా ఫైన్ కట్టాల్సింది పోయి ఏకంగా విధుల్లో ఉన్న హోంగార్డుపై దాడికి తెగబడ్డాడు. సోమాజిగూడ ఎంఎస్‌‌‌‌ మక్తాకు చెందిన యశ్వంత్‌‌‌‌ (25) ఆదివారం తన తండ్రితో కలిసి వెళ్తుండగా, అబిడ్స్ జీపీవో వద్ద ట్రాఫిక్ ఎస్సై అనిల్ వారిని ఆపి ప్రశ్నించాడు. 

ఈ క్రమంలో యశ్వంత్ దురుసుగా వాగ్వివాదానికి దిగాడు. గొడవను సర్దిచెప్పేందుకు ప్రయత్నించిన హోంగార్డు కుమార్ ముఖంపై దాడి చేశాడు. దీంతో సదరు టెక్కీని ట్రాఫిక్ సిబ్బంది వెంటనే అదుపులోకి తీసుకొని, ఎస్సై ఫిర్యాదు మేరకు అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.