బైక్ అదుపుతప్పి టెకీ మృతి.. మరో యువకుడికి గాయాలు

బైక్ అదుపుతప్పి టెకీ మృతి.. మరో యువకుడికి గాయాలు

కూకట్​పల్లి, వెలుగు: బైక్ అదుపుతప్పి డివైడర్‎ను ఢీకొనడంతో సాఫ్ట్​వేర్ ఇంజినీర్ మృతి చెందాడు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన ఎన్.తేజేంద్ర ఫణికుమార్ (26) కొండాపూర్‎లో ఉంటూ సాఫ్ట్​వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి తన ఫ్రెండ్‎తో కలిసి బైక్‎పై జేఎన్టీయూ రోడ్​ నుంచి కొండాపూర్‎కు బయలుదేరారు. మార్గమధ్యలో అదుపుతప్పి డివైడర్‎ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తేజేంద్ర స్పాట్‎లోనే మృతి చెందగా, బైక్ నడిపిన ఫణికుమార్ గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటనపై కేపీహెచ్‌బీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.