
హైదరాబాద్ ఎల్బీనగర్ లోని హస్తీనాపురంలో విషాదం చోటుచేసుకుంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగి కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ప్రదీప్ అతని భార్య స్వాతి విషం తీసుకొని తమ పిల్లలు ఐదేళ్ల జయకృష్ణ, ఏడాది వయస్సున్న కళ్యాణ్ కృష్టకు కూడా ఇచ్చారు. దీంతో నలుగురు చనిపోయారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్ లో తెలిపారు ప్రదీప్. డెడ్ బాడీలను పోస్టు మార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.