
మన దేశంలో ఉద్యోగ ఇంటర్వ్యూ సంస్కృతి దారుణంగా ఉందా? భారత్ లో టెక్ నియామకాల్లో ఇంటర్వ్యూలు చాలా కఠినంగా ఉన్నాయా? ఇంటర్వ్యూ పాస్ కావాలంటే ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ కావాల్సి వస్తోందా..? రెడ్డిట్లో ఓ టెకీ ప్రస్టేషన్ తో పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. టెకీ చెప్పినట్లు నిజంగానే ఐటీ ఉద్యోగాలు పొందాలంటే ఆ స్థాయిలో కష్టపడాలా? టెకీ పోస్ట్ పై నెటిజన్లలో పెద్ద చర్చ సాగుతోంది. వివరాల్లోకి వెళితే.
ఐటీ కంపెనీల్లో ఉద్యోగానికి ఇంటర్వ్యూలు చాలా దారుణంగా ఉన్నాయి. ఇంటర్వ్యూ ప్రిపరేషన్ స్థాయి చూస్తే కాంపిటిటీవ్ పరీక్షలకు ప్రిపేర్ అయినంత క్లిష్టంగా ఉంది.. ఐటీ ఉద్యోగాలకు భారత్ లో కంటే యూకేలో చాలా ఈజీగా ఉన్నాయని ఆ టెకీ ప్రస్టేషన్ తో రెడ్డిట్ లో పోస్ట్ షేర్ చేశారు. దీనిపై నెటిజన్లలో పెద్ద చర్చ సాగుతోంది.
నిరాశనిస్పృహలతో టెకీ షేర్ చేసిన రెడ్డిట్ పోస్ట్ భారత్ దేశంలోని టెక్ వర్గాలకు బాగా కనెక్ట్ అయింది. ఆరు నెలలుగా ఉద్యోగ వేటలో ఉన్నాను. యూరప్ తో పోలిస్తే భారత్ లో ఇంటర్వ్యూలు చాలా క్రేజీగా ఉన్నాయని రాశారు.
యూరప్ లో తన స్నేహితుడికి మూడు నెలల్లో రెండు ఉద్యోగ ఆఫర్లు వచ్చినప్పటికీ భారత్ లో మాత్రం చాలా చాలా కష్టతరంగా మారిందన్నారు. యూరప్ లో ఇంటర్వ్యూలు చాలా ఈజీగా ఉంటాయి. అదే మన దేశంలో ఎండ్ టు ఎండ్ మెషిన్ కోడ్ ను అమలు చేయమని అడుగుతున్నారని అన్నారు.
ప్రస్తుతం చిన్న టౌన్లు, పట్టణాలనుంచి వచ్చే అభ్యర్థులు కూడా ఇప్పుడు ప్రిపరేషన్ మెటీరియల్ని పొందగలుగుతుండటంతో ఇంటర్వ్యూ కష్టం పెరిగిందని టెకీ ఓ వాదనను ముందుకు తెచ్చారు. దీనిపై నెటిజన్లు పెద్ద సంఖ్యలో స్పందించారు.
గతంలో టైర్1కాలేజీలు(మెట్రోనగరాల్లో టాలెంట్ ఉన్న విద్యా్ర్థులు) అభ్యర్థులు తప్ప టెక్ కంపెనీల్లో ఎలా ఉద్యోగం సాధించాలో ఎవరికీ తెలియదు.. ఇప్పుడు అందరికి ఇంటర్వ్యూ ఎలా సాధించాలో తెలిసిపోయింది.. అ అందుకే నిర్వహకులు ఇంటర్వ్యూలు మరింత కఠినతరం చేస్తున్నారని ఓ నెటిజన్ చెప్పారు.
అయితే ఈ వాదనను కొందరు నెటిజన్లు మాత్రమే అంగీకరించారు. ఇది కేవలం సరఫరా,డిమాండ్ మీద ఆధారపడి ఉంటుందని అని వాదించారు.టెక్ కంపెనీల్లో తగిన-న్ని ఉద్యోగాలు లేవని మరికొందరు అంటున్నారు.
"నిజాయితీగా చెప్పాలంటే, ఇంటర్వ్యూ నిర్వాహకులు మాత్రం ఏం చేస్తారు..?ఉద్యోగ సంబంధిత ప్రశ్నలు మాత్రమే అడిగితే వారికి వెయ్యి మంది అర్హత కలిగిన అభ్యర్థులు వస్తారు. ఇది ఇప్పుడు ప్రభుత్వ పరీక్ష లాంటిది - కఠినమైన సిలబస్ తో బెస్ట్ క్యాండిడేట్లను ఎంచుకోవాలని ఆశిస్తున్నారని మరో నెటిజన్ ఎత్తిచూపారు.
నిరాశ నిజమే..
ఇంటర్వ్యూ చేసేవాళ్లు అహంకారులు, వారు చేసేవి ఇంటర్వ్యూలు కాదు.. ప్రతీకారం తీసుకుంటున్నారు అని ఇంకో నెటిజన్ కొంచె ఘాటుగా స్పందించారు. Facebook, Apple, Amazon, Netflix, Google వంటి పెద్ద సాంకేతిక సంస్థలలో ఉద్యోగాల కోసం నిర్వహించే ఇంటర్వ్యూలను సాధించడం చాలా కష్టం. ఈ కంపెనీల ఇంటర్వ్యూలు పోటీ ఎక్కువగా ఉంటాయి ..కఠినమైన సాంకేతిక ప్రశ్నలు,బిహేవియర్ ప్రశ్నలను ఉంటాయి. FAANG ఇంటర్వ్యూలు పెద్ద సవాలే అయినప్పటికీ సరైన ప్రిపరేషన్ తో వాటిని సాధించవచ్చని మరికొందరు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇలా రకరకాల ప్రశ్నలతో రోజురోజుకు కష్టతరమవుతున్న టెకీ ఉద్యోగాల సాధనపై సాగిన చర్చలో ఓవరాల్ గా సరైన ప్రిపరేషన్ తో వాటిని సాధించవచ్చని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేశారు.