
భూదాన్ పోచంపల్లిలోని స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్‌స్టిట్యూట్ (ఎస్ఆర్టీఆర్ఐ) వివిధ షార్ట్టెర్మ్ టెక్నికల్ కోర్సుల్లో గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకం ద్వారా ఉపాధి ఆధారిత టెక్నికల్ కోర్సుల్లో మూడు నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం కల్పిస్తారు.
గమనిక: 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్న గ్రామీణ ప్రాంతాల్లోని యువతీయువకులు అర్హులు. చదువు కొనసాగిస్తున్న వారు అనర్హులు.
ఉచిత శిక్షణ, హాస్టల్ వసతి
ఎంపికయిన అభ్యర్థులకు మూడు నెలల పాటు హాస్టల్ వసతి, భోజన సదుపాయం కల్పించి ఉచిత శిక్షణ ఇస్తారు. అనంతరం ఉద్యోగం కల్పిస్తారు. అభ్యర్థులు రీఫండబుల్ ఫీజు కింద ఒక్కొక్కరు రూ.250 చెల్లించాలి. ఆసక్తి గలవారు ఒరిజినల్ సర్టిఫికెట్స్తో పాటు ఒక సెట్ జిరాక్స్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాస్పోర్ట్ ఫోటో తీసుకొని జూలై 16న రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్లో కౌన్సెలింగ్కు హాజరు కావాలి.
అడ్మిషన్ల తేది: 2019 జూలై 16
చిరునామా: జలాల్‌పూర్ (విలేజ్), భూదాన్ పోచంపల్లి (మండలం),
యాదాద్రి భువనగిరి (జిల్లా)
తెలంగాణ – 508284
ఫోన్ నంబర్లు: 9948466111, 9133908000, 9133908111, 9133908222
వెబ్సైట్: www.srtri.com
కోర్సులు | డ్యురేషన్ | అర్హత |
ఆటోమొబైల్ సర్వీసింగ్(2, 3 వీలర్) | 3 నెలలు | పదోతరగతి పాస్/ఐటీఐ |
ఎలక్ర్టానిక్ వస్తువుల రిపేర్, మెయింటెనెన్స్ | 3 నెలలు | పదోతరగతి పాస్/ఐటీఐ |
ఎలక్ర్టీషియన్ (డొమెస్టిక్) | 4 నెలలు | పదోతరగతి పాస్/ఐటీఐ |
డి.టి.పి, ప్రింట్ పబ్లిషింగ్ అసిస్టెంట్ | 3 నెలలు | ఇంటర్మీడియట్ పాస్ |
అకౌంట్స్ అసిస్టెంట్ (ట్యాలీ) | 3 నెలలు | బీకాం పాస్ |
కంప్యూటర్ హార్డ్వేర్ అసిస్టెంట్ | 3 నెలలు | ఇంటర్మీడియట్ పాస్ |
సోలార్ సిస్టమ్ ఇన్‌స్టలేషన్ మరియు సర్వీస్ | 3 నెలలు | ఇంటర్మీడియట్ పాస్/ఐటీఐ |
సూయింగ్ మెషీన్ ఆపరేటర్ (టైలరింగ్) | 3 నెలలు | ఏడోతరగతి పాస్/ఫెయిల్ |