సినిమా ఆలస్యమైందని ప్రేక్షకుల నిరసన

సినిమా ఆలస్యమైందని ప్రేక్షకుల నిరసన

బంజారాహిల్స్ PVR RK సినీ ఫ్లెక్స్ థియేటర్ వద్ద ఆందోళన నెలకొంది. ఇవాళ మధ్యాహ్నం 1.15 కి మొదలు కావాల్సిన 'సీతారామం' మూవీ షో గంటన్నర అయిన స్టార్ట్ కాలేదు. అయితే టెక్నీకల్ ప్రాబ్లం వలన షో క్యాన్సిల్ చేస్తున్నట్లు PVR యాజమాన్యం చెప్పింది. దీంతో సినిమా ప్రేక్షకులు ఆందోళన దిగారు. థియేటర్ సిబ్బందితో ప్రేక్షకులు వాగ్వాదానికి దిగారు.

ఈ క్రమంలో మీ అమౌంట్ రీఫండ్ చేస్తామని యాజమాన్యం చెప్పింది. అయితే ఆదివారం సెలవు రోజు సమయాన్ని వృధా చేశారంటూ సిబ్బందితో వాగ్వాదం చేశారు. ప్రేక్షకులు ఎంతకూ వినకపోవడంతో థియేటర్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసుల థియేటర్ వద్దకు చేరుకుని వివరాలు తెలుసుకున్నారు.