సీఎం కేసీఆర్ హెలీకాప్టర్ లో సాంకేతిక సమస్య

సీఎం కేసీఆర్ హెలీకాప్టర్ లో సాంకేతిక సమస్య

సీఎం కేసీఆర్ హెలీకాప్టర్ లో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో పైలట్ అప్రమత్తమయ్యాడు. వెంటనే హెలీకాప్టర్ ను ఎర్రవెల్లి ఫామ్ హౌజ్ కు మళ్లించి, అక్కడ సేఫ్ ల్యాండింగ్  చేశాడు. ప్రస్తుతం ఫామ్ హౌజ్ లోనే ఉన్నారు కేసీఆర్. ఏవియేషన్ సంస్థ ప్రత్యామ్నాయ హెలీకాప్టర్ ను ఏర్పాటు చేయనుంది. దీంతో అప్పటి వరకు కేసీఆర్ అక్కడే ఉండనున్నారు. మరో హెలీకాప్టర్ వచ్చాకా కేసీఆర్ దేవరకద్ర సభకు బయలుదేరనున్నారు. దేవరకద్ర తర్వాత మరో మూడు సభకు వెళ్లాల్సి ఉంది కేసీఆర్.