
ప్రమాదవశాత్తు 8వ అంతస్తు నుండి కిందపడి యువకుడు మరణించిన సంఘటన గురువారం హైదరాబాద్ లో జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా వీరవెల్లి గ్రామానికి చెందిన చిన్నం అనిల్ కుమార్(22) ఇంటర్ పూర్తి చేసి, హైదరాబాద్ లో లిఫ్ట్ మెకానిక్ గా ఉద్యోగం చేస్తున్నాడు. జాబ్ పనిమీద గురువారం కోకాపేటలోని ఓ అపార్ట్ మెంట్ లో లిఫ్ట్ రిపేర్ చేయడానికి వెళ్లాడు. అయితే ..8వ ఫ్లోర్ ఓపెన్ ప్లేస్ చూసుకోకుండా అడుగువేయడంతో ..అతడు కిందపడి అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని.. అనిల్ మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ కోసం ఉస్మానియా హస్పిట్ ల్ కి తరలించారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. అనిల్ కుటుంబం ఆర్థికంగా వెనకబడంటంతో గ్రామ యూత్ వాట్సాప్ గ్రూప్ ల ద్వారా తోచిన సాయాన్ని అందిస్తున్నారు.
see more news