31కు ఏం చేస్తుండ్రు ? జామకాయలు అమ్ముకుంటం

31కు ఏం చేస్తుండ్రు ? జామకాయలు అమ్ముకుంటం

ఇంకొన్ని గంటలల్ల నయా సాల్ వస్తది. ఇట్లాంటి ఇంపార్టెంట్ టైంల కొందరు మహిళా చిరువ్యాపారులను తీన్మార్ చంద్రవ్వ పలకరించింది. తనదైన శైలిలో సరదాగా ప్రశ్నలు వేసి.. వాళ్ల దిల్ ల ఉన్న మాటలను రాబట్టింది. నయా సాల్ సెలబ్రేషన్స్ ఎట్ల చేస్కుంటరు దగ్గరి నుంచి మొదలుపెడితే సెలబ్రేషన్స్ కు ఎంత ఖర్చయితది అనే దాకా రకరకాల ప్రశ్నలను చంద్రవ్వ అడిగింది. దీనికి వారు సూటిగా, సుత్తి లేకుండా సమాధానాలు ఇచ్చిండ్రు. వాళ్ల మధ్య సరదా సంభాషణ ఇట్ల సాగింది.. 

చంద్రవ్వ : ఇయ్యాల రాత్రి ఏం చేస్తవ్

మహిళా చిరు వ్యాపారి : జాంకాయల బండి పెట్టి.. జాంకాయలు అమ్ముతం

చంద్రవ్వ : ఒకవేళ ఏదైనా చేస్కుంటే.. ఏం చేస్కుంటవ్

మహిళా చిరు వ్యాపారి : పాయసం, అన్నం, పప్పు వండుకుంటం

మళ్ల సంవత్సరం దాకా ఉంటమో లేదో తెల్వదు

చంద్రవ్వ : ఇయ్యాల రాత్రి స్పెషల్ ఏంది ?

మహిళా చిరు వ్యాపారి :   ఎంజాయ్ చేస్తం.. చికెన్ తింటం.. చేపలు తింటం.. కేకులు తింటం..డ్యాన్సులు చేస్తం.. మళ్ల సంవత్సరం దాకా ఉంటమో లేదో తెల్వదు 

చేపల దావత్ చేస్కుంటం

చంద్రవ్వ : ఇయ్యాల రాత్రి ఏం వండుకుంటవ్ ?

మహిళా చిరువ్యాపారి : చేపల దావత్ చేస్కుంటం. 

చంద్రవ్వ : పులుసు పెట్టుకుంటవా.. ఫ్రై చేసుకుంటవా ?

మహిళా చిరువ్యాపారి : చేపలు ఫ్రై చేసుకుంటం. పులుసు కూడా చేస్తం. పిల్లలు హోటళ్ల నుంచి బిర్యానీలు తెచ్చుకొని తింటరు.

పేదోడు బతకడమే కష్టం

చంద్రవ్వ : ఇయ్యాల రాత్రి ఎట్ల సెలబ్రేట్ చేస్కుంటవ్

మహిళా చిరువ్యాపారి : మాలాంటి పేదోళ్లు.. ఉల్లిగడ్డలు అమ్ముకునేటోళ్లు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోలేం. చికెన్ లు, మటన్ లు తినే అదృష్టం మాకు లేదు.

చంద్రవ్వ : ఇయ్యాల దావత్ ఏంది ?

మహిళా చిరువ్యాపారి : పేదోడు బతకడమే కష్టం ఈ లోకంలో.. పప్పన్నమే మా దావత్. డబ్బున్నోళ్లు ఎన్ని న్యూ ఇయర్ లు అయినా చేస్కుంటరు.