తీన్మార్ మల్లన్నకు బెయిల్

తీన్మార్ మల్లన్నకు బెయిల్

తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌కు బెయిల్ మంజూరు అయ్యింది.  అన్ని కేసుల్లో బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌ చిలకలగూడతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. తీన్మార్ మల్లన్న పై ఇప్పటివరకు 38 కేసులు నమోదు అయ్యాయి. దీంతో మల్లన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. 6 కేసులను కొట్టివేసిన హైకోర్టు మిగతా 32 కేసులో 31 కేసులకు బెయిల్ మంజూరు చేసింది. దాదాపు 74 రోజుల పాటు తీన్మార్ మల్లన్న జైలులో ఉన్నాడు.