ఘట్​కేసర్​లో తీన్మార్ మల్లన్న బహిరంగ సభ

ఘట్​కేసర్​లో తీన్మార్ మల్లన్న బహిరంగ సభ
  • ఆగస్టులో 6 వేల కి.మీ. పాదయాత్ర ప్రారంభం
  • పాదయాత్ర కో ఆర్డినేట్‌ చేసేందుకు అడహక్ కమిటీల నియామకం
  • ఈ నెల 17లోపు మండల కమిటీల ఏర్పాటు 
  • ముఖ్య నేతల సమావేశంలో ప్రకటించిన తీన్మార్‌ మల్లన్న

హైదరాబాద్‌‌, వెలుగు: దొరల గడీల్లో బందీ అయిన తెలంగాణ తల్లిని విముక్తి చేసేందుకు తన సైన్యం సిద్ధమైందని తీన్మార్​ మల్లన్న ప్రకటించారు. ఈ నెల 18న హైదరాబాద్ శివారులోని ఘట్‌‌కేసర్‌‌లో బహిరంగ సభ నిర్వహిస్తామని, ఈ సభలో భవిష్యత్  కార్యాచరణను ప్రకటిస్తామని వెల్లడించారు. గురువారం హైదరాబాద్‌‌ శివారులోని ఓ ప్రైవేట్‌‌ ఫంక్షన్‌‌ హాల్‌‌లో నిర్వహించిన ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆగస్టులో పాదయాత్రను ప్రారంభించనున్నట్లు, రాష్ట్రవ్యాప్తంగా 6 వేల కిలోమీటర్లు ఇది కొనసాగుతుందని చెప్పారు. పాదయాత్రను కో ఆర్డినేట్ చేసేందుకు రాష్ట్ర, జిల్లా అడహక్ కమిటీలను ఆయన ప్రకటించారు. రాష్ట్ర కన్వీనర్‌‌గా దాసరి భూమయ్య, కో కన్వీనర్‌‌గా మాదం రజినీకుమార్‌‌తోపాటు 10 మంది మెంబర్స్‌‌ను నియమించారు. ఈ నెల 17లోపు మండల కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు నాగయ్య, చందు, శ్రీకాంత్ రెడ్డి, మాంచాల గూడూరు, ఈశ్వరీ, మధు పాల్గొన్నారు. 

జిల్లాల కన్వీనర్లు వీళ్లే..
రాష్ట్రంలోని 33 జిల్లాలకు కన్వీనర్లు, కో కన్వీనర్లతో పాటు 10 మంది సభ్యులను తీన్మార్‌‌ మల్లన్న నియమించారు. జిల్లాల కన్వీనర్లుగా యు.విశ్వం(కరీంనగర్), డాక్టర్ వివేక్  పటేల్(పెద్దపల్లి ), పురుషోత్తం(జగిత్యాల), దేవరాజ్ (సిరిసిల్ల), కె.హరినాయక్ (మహబూబ్ నగర్), జి.సతీశ్​ (నాగర్ కర్నూల్), ఎస్. రవికుమార్ (వనపర్తి), ఎండీ మాజ్ (గద్వాల్), శివారెడ్డి (నారాయణపేట), యు.విజయ్ కుమార్ (వరంగల్ అర్బన్), కె. మణికంఠ (వరంగల్ రూరల్), జంపన్న (భూపాలపల్లి), ఎం.భద్రయ్య (ములుగు), జి.రామకృష్ణ (మహబూబాబాద్), పి.రఘు (జనగామ), వనిత (ఆదిలాబాద్), డి.మారుతి (ఆసిఫాబాద్), వెంకట మహేంద్ర (నిర్మల్), డి.రఘునాథ్ (మంచిర్యాల), డీఎల్ఎన్ చారి (నిజామాబాద్), కె.సత్యం సిద్ధార్థ్ (కామారెడ్డి ), కె.కృష్ణ (రంగారెడ్డి), కె. అర్జున్ రెడ్డి (వికారాబాద్), లక్ష్మణ్ (మెదక్), జి. మహేశ్​ (సిద్దిపేట), కిషోర్ (సంగారెడ్డి), ఎం.చంద్రశేఖర్ (హైదరాబాద్), జి.మహేందర్ గౌడ్ (మేడ్చల్ మల్కాజిగిరి), జి. రమేశ్​ (ఖమ్మం), పి.రాజీవ్ కుమార్ (కొత్తగూడెం), పి.ధనుంజయ్ (నల్గొండ), కె. శ్రీను (సూర్యాపేట), బి.సునీత (యాదాద్రి భువనగిరి ) నియమితులయ్యారు.