భువనగిరి ఎంపీ టికెట్ కోసం తీన్మార్ మల్లన్న దరఖాస్తు

భువనగిరి ఎంపీ టికెట్ కోసం తీన్మార్ మల్లన్న దరఖాస్తు
  • భువనగిరి గెలిచి సోనియమ్మ రుణం తీర్చుకుంటా..
  • అధిష్టానం అవకామిస్తే భువనగిరిలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తా..
  • కాంగ్రెస్ ప్రచార కమిటీ కన్వీనర్ తీన్మార్ మల్లన్న
  • భువనగిరి లోక్ సభ టికెట్ కోసం..
  • గాంధీ భవన్ లో మల్లన్న దరఖాస్తు
 

 తీన్నార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ కాంగ్రెస్ నుంచి భువనిగిరి ఎంపీకి అప్లై చేసుకున్నారు. ఈ మేరకు గాంధీ భవన్ లో అప్లికేషన్ ఇచ్చారు. కాంగ్రెస్ టికెట్ ఇస్తే భువనగిరి నుంచి గెలిచి రాహుల్ గాంధీ రుణం తీర్చుకుంటానని చెప్పారు.

 దేశ,రాష్ట్ర వ్యాప్తంగా హస్తానికి అనుకూల పవనాలున్నాయి.. ఈ సారి కాంగ్రెస్ తరపున భువనగిరి లోక్ సభ టికెట్ ఇస్తే గెలిచి రాహుల్ గాంధీ రుణం తీర్చుకుంటాను. భువనగిరి లోక్ సభ పార్లమెంట్ పరిధిలో మాస్ ఫాలోయింగ్ ఉన్నందుకు గర్వంగా ఉంది. అందువల్ల కాంగ్రెస్ అధిష్టానం ఈసారి తనకు పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తుందనే గట్టి విశ్వాసంతో ఉన్నాను. బుధవారం భువనగిరి లోక్ సభ సీటు కోసం గాంధీ భవన్ లో దరఖాస్తు చేశాను. చాన్నాళ్లుగా ప్రజా సమస్యలు,గత బీఆర్ఎస్ వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటాలు చేశాను. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గడీలను బద్దలు కొట్టగల్గాను. మున్ముందు బీఆర్ఎస్ ను భూస్థాపితం చేసేందుకు ఒక బాధ్యతాయుతమైన పదవి ఉంటే బాగుంటుందని భావిస్తున్నాను. అందువల్ల హైకమాండ్ భువనగిరి టికెట్ ఇస్తే.. భువనగిరి ఖిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తానని తీన్మార్ మల్లన్న వెల్లడించారు.