Mirai: పవర్ ఆఫ్ మిరాయ్

Mirai: పవర్ ఆఫ్ మిరాయ్

‘హనుమాన్’ చిత్రంతో సూపర్ సక్సెస్‌‌ను అందుకుని పాన్ ఇండియా వైడ్‌‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు తేజ సజ్జా. ప్రస్తుతం తను నటిస్తున్న  మరో పాన్ ఇండియా మూవీ ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌‌‌‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల కో ప్రొడ్యూసర్. 

ఇప్పటికే ఫస్ట్ లుక్, గ్లింప్స్‌‌తో ఇంప్రెస్ చేశాడు తేజ. శుక్రవారం తన పుట్టినరోజు సందర్భంగా కొత్త పోస్టర్‌‌‌‌తో తేజకు విషెస్ చెప్పారు మేకర్స్.  ఇందులో తను  ఇంటెన్స్ గెటప్‌‌లో కనిపిస్తున్నాడు.  విధ్వంసకర పరిస్థితుల్లో చిక్కుకున్న తేజ  అద్భుతమైన పవర్స్‌‌ను కలిగి ఉన్నట్టు పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.  మండుతున్న ఐరెన్ రాడ్‌‌ను పట్టుకుని పైకి చూస్తుండగా, బ్యాక్‌‌డ్రాప్‌‌లో  ఒక పురాతన దేవాలయం ఉండటం సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. ఇదొక సూపర్ యోధ కథ.  మిరాయ్ అనేది అశోకుని కాలంలో రహస్యమైన ఓ శాసనం. దాన్ని కాపాడే పాత్రలో తేజ సజ్జా నటిస్తున్నాడు. రితికా నాయక్ హీరోయిన్‌‌గా నటిస్తోంది. మంచు మనోజ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.  హరి గౌర సంగీతం అందిస్తున్నాడు.  వచ్చే ఏడాది ఏప్రిల్ 18న ఈ చిత్రాన్ని త్రీడీలో వరల్డ్‌‌వైడ్‌‌గా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే  ప్రకటించారు.