
తేజ సజ్జా హీరోగా, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని రూపొందించిన చిత్రం 'మిరాయ్' (Mirai). సెప్టెంబర్ 12న విడుదలైన ఈ మైథలాజికల్ ఫాంటసీ యాక్షన్-అడ్వెంచర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో 3 మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటింది. బాక్సాఫీస్ వద్ద 2025లో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది. 'హను-మాన్' వంటి విజయం తర్వాత తేజ సజ్జాకు 'మిరాయ్" వరుసగా రెండో పెద్ద విజయం కావడంతో, ఆయన కెరీర్‌లో ఇది ముఖ్యమైన మలుపుగా నిలిచింది.
అదనపు కంటెంట్‌తో OTTలోకి 'మిరాయ్'
థియేటర్లలో అద్భుతమైన విజయం సాధించిన ఈ చిత్రం, డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. 'మిరాయ్' అక్టోబర్ 10, 2025 నుండి జియోహాట్ స్టార్ లో అందుబాటులోకి రానుంది. కేవలం నాలుగు వారాల వ్యవధిలోనే ఓటీటీలోకి వస్త్తోంది. థియేటర్ లో మిస్ అయిన అభిమానులకు ఓటీటీలో చూసేందుకు అవకాశం కలుగుతోంది. ఇది తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. హిందీ వెర్షన్ మాత్రం థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత దాదాపు రెండు నెలలకు విడుదలయ్యే అవకాశం ఉంది.
లేటెస్ట్ గా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఇచ్చిన ఓ హింట్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. దాదాపు నాలుగు గంటల ఫుటేజీని చిత్రీకరించగా, అందులో చాలా భాగం తుది ఎడిటింగ్‌లో తొలగించినట్లు ఆయన తెలిపారు. అయితే, తాను ఎంతగానో ఇష్టపడే కొన్ని సన్నివేశాలను ఓటీటీ వెర్షన్‌లో చేర్చబోతున్నట్లు ఆయన సూచనప్రాయంగా వెల్లడించారు. దీంతో, థియేటర్లలో సినిమా చూసిన ప్రేక్షకులు సైతం మళ్లీ ఈ చిత్రాన్ని OTTలోకి చూసేందుకు రెడీగా ఉన్నారు.
విమర్శకుల ప్రశంసలు..
టీజీ విశ్వ ప్రసాద్ నేతృత్వంలోని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై రూ. 60 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం, విడుదలైన తొలిరోజు నుంచే పాజిటివ్ ను అందుకుంది. అశోక చక్రవర్తికి సంబంధించిన తొమ్మిది రహస్య గ్రంథాలు, వాటిని రక్షించే సూపర్ యోధా వారసత్వం అనే భారతీయ పురాణాల మూలాలతో కథను అద్భుతంగా తీర్చిదిద్దారు. సినిమాలో కేవలం విజువల్ ఎఫెక్ట్స్ (VFX) మాత్రమే కాకుండా, కథానాయకుడిగా తేజ సజ్జా పాత్ర, అతనికి దీటుగా భయంకరమైన విలన్ పాత్రలో మంచు మనోజ్ నటన సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. మనోజ్ పోషించిన మహావీర్ లామా పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. సహాయక పాత్రల్లో శ్రీయా శరణ్, జగపతి బాబు, రితికా నాయక్, జయరాం, గెటప్ శ్రీను వంటి నటులు తమ పాత్రలకు గాంభీర్యాన్ని, లోతును తీసుకొచ్చారు.
►ALSO READ | Akira Nandan: OG' ఫ్రాంఛైజీలో అకీరా నందన్ ఎంట్రీ.. పవనిజంతో ఫ్యాన్స్‌ని ఖుషీ చేస్తాడా?
దిల్ రాజు అభినందన
'మిరాయ్' సాధించిన అద్భుత విజయాన్ని పురస్కరించుకుని ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రత్యేకంగా చిత్ర బృందాన్ని అభినందించారు. హీరో తేజ సజ్జా, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని కోసం ఆయన ఇంట్లో ఆత్మీయ వేడుక నిర్వహించారు. కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ ఘన విజయం తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వకారణమని దిల్ రాజు పేర్కొన్నారు.