Akira Nandan: OG' ఫ్రాంఛైజీలో అకీరా నందన్ ఎంట్రీ.. పవనిజంతో ఫ్యాన్స్‌ని ఖుషీ చేస్తాడా?

Akira Nandan: OG' ఫ్రాంఛైజీలో అకీరా నందన్ ఎంట్రీ.. పవనిజంతో ఫ్యాన్స్‌ని ఖుషీ చేస్తాడా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా చిత్రం 'ఓజీ' (They Call Him OG). సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాపంగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమా రికార్డుల వేటను చూసి, అభిమానులు, సినీ వర్గాలు అంతా ఉత్సాహాంలో మునిగితేలుతున్నారు. ఈ ఉత్సాహాన్ని మరింత పెంచుతూ..  దర్శకుడు సుజీత్ 'ఓజీ' ఫ్రాంఛైజీ గురించి అప్డేట్ ఇచ్చారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్ సినిమాలోకి ఎంట్రీపై ఆసక్తికరమైన హింట్స్ ఇచ్చారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది తెగ వైరల్అవుతోంది.

'ఓజీ' యూనివర్స్‌లో అకీరా నందన్?

'ఓజీ' విజయాన్ని పంచుకోవడానికి సంగీత దర్శకుడు థమన్,  దర్శకుడు సుజీత్య USAలోని డల్లాస్‌లో జరిగిన ప్రత్యేక స్క్రీనింగ్‌కు హాజరయ్యారు. అక్కడ అభిమానులతో ముచ్చటిస్తున్న సమయంలో..  సుజీత్ 'ఓజీ' యూనివర్స్‌కు సంబంధించిన కొన్ని అప్‌డేట్‌లను పంచుకున్నారు. అక్కడ ఒక అభిమాని.. అకీరా నందన్ 'ఓజీ'లో భాగం అవుతారా? అని అడగగా, సుజీత్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. "ఇప్పుడే చెప్పేస్తే మీకు కిక్ ఉండదు కదా!" అంటూ చిరునవ్వుతో దాటవేశారు. ఈ ఒక్క మాటతో, సుజీత్ అకీరా నందన్ పాత్రపై ఉన్న ఊహాగానాలకు మరింత ఊతమిచ్చినట్లయింది. ఈ వ్యాఖ్యల ద్వారా అకీరా ఎంట్రీని సుజీత్ ధృవీకరించకపోయినా, పూర్తిగా కొట్టిపారేయకపోవడం అభిమానుల్లో ఉత్కంఠను పెంచింది.

ALSO READ : సుకుమార్ చేతుల మీదుగా 'షేర్‌ టీ' ప్రారంభం.. 

బాక్సాఫీస్ వద్ద 'ఓజీ' రికార్డు..

ఈ 'ఓజీ' మూవీలో పవన్ కల్యాణ్‌ను ఓజాస్ గంభీరా అనే పాత్రలో శక్తిమంతమైన గ్యాంగ్‌స్టర్‌గా చూపించింది. ఈ సినిమా ఇప్పటికే  ప్రపంచ వ్యాప్తంగా  ఇప్పటివరకు రూ. 278 కోట్లకు పైగా పైగా వసూళ్లను సాధించింది. పవన్ కెరీర్ లో బాక్సాఫీస్‌ వద్ద తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. ఈ భారీ విజయాన్ని దృష్టిలో ఉంచుకునే, పవన్ కల్యాణ్ సైతం సినిమా విడుదల తర్వాత ఇటీవల జరిగిన ఓ వేడుకలో 'ఓజీ'కి ప్రీక్వెల్, సీక్వెల్ తప్పకుండా ఉంటాయని అధికారికంగా ప్రకటించారు. ఈ రికార్డు స్థాయి ఓపెనింగ్స్ తమను ఈ కథా ప్రపంచాన్ని విస్తరించడానికి ప్రేరేపించాయని ఆయన స్పష్టం చేశారు.

ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ నటన, స్టైల్ ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చాయి. బాలీవుడ్ నటుడు ఎమ్రాన్ హష్మీ 'ఓమీ భావు' పాత్రలో టాలీవుడ్‌కి పరిచయమవగా, ప్రియాంక మోహన్, అర్జున్ దాస్, శ్రీయ రెడ్డి, ప్రకాశ్ రాజ్ వంటి నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. ఈ గ్యాంగ్‌స్టర్ కథా నేపథ్యం, సుజీత్ దర్శకత్వంలో చేసిన పవర్-ప్యాక్డ్ యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమా విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.

అయితే, ఇప్పుడు దర్శకుడు సుజీత్ ఇచ్చిన తాజా హింట్, 'ఓజీ' సీక్వెల్స్ లేదా ప్రీక్వెల్‌లో అకీరాను ప్రేక్షకులు చూసే అవకాశం ఉందా అనే కొత్త ఆశను రేకెత్తించింది. ఈ 'ఓజీ' యూనివర్స్ విస్తరిస్తే, పవన్ కల్యాణ్ తర్వాత ఈ గ్యాంగ్‌స్టర్ ఫ్రాంఛైజీని అకీరా ముందుకు నడిపిస్తారేమో చూడాలి.