
మీరు ముఖ్యమంత్రి అభ్యర్దా..? పదోతరగతి కూడా పాస్ కాలేదు. లక్ష ఉద్యోగాలు ఇస్తామని అంటున్నారు. లక్ష ఉద్యోగాలు కాదు. ముందు మీరు కేబినెట్ స్పెలింగ్ రాయండి అంటూ బీజేపీ సెంట్రల్ మినిస్టర్ అశ్వినీ కుమార్ చౌబే.., ఆర్జేడీ చీఫ్ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీయాదవ్ సెటైర్లు వేశారు.
బీహార్ సెకండ్ ఫేజ్ ఎన్నికల పై అశ్వినీ కుమార్ మాట్లాడుతూ ..బీహార్ లో కాంగ్రెస్ – ఆర్జేడీ అలయన్స్ ను గప్పు – పప్పు గా అభివర్ణించారు. బడాయి ఆర్జేడీ, పప్పు కాంగ్రెస్ లు ప్రజలకు లప్పు(తప్పుడు హామీలు) ఇస్తారంటూ ఎద్దేవా చేశారు.
ఇక ఆర్జేడీ – కాంగ్రెస్ అలయన్స్ లో ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఉన్న ఆర్జేడీ చీఫ్ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీయాదవ్ టెన్త్ క్లాస్ కూడా పాస్ కాలేదు. అలాంటిది క్వాలిఫైడ్ ఇంజినీర్, బీహార్ సీఎం నితిష్ కుమార్ పై సెటైర్లు వేయడం విచిత్రంగా ఉందన్నారు.
గతంలో తేజస్వీతండ్రి లాలూప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఎన్నికల ప్రచారంలో తాను గెలిస్తే లక్షజాబులు ఇస్తామని, గెలిచిన తరువాత నిరుద్యోగల నుంచి డబ్బులు వసూలు చేసి వారి అప్లికేషన్లను డస్ట్ బిన్ లో వేశారని ప్రస్తావించారు బీజేపీ సెంట్రల్ మినిస్టర్ అశ్వినీ కుమార్ చౌబే