వారిలో 6 నెలలకే యాంటీబాడీలు మాయం

వారిలో 6 నెలలకే యాంటీబాడీలు మాయం

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఆరు నెలల నుంచే రోగ నిరోధక శక్తి తగ్గిపోతోందని..30శాతం మందిలో యాంటీ బాడీల సంఖ్య పడిపోతోందని ఏఐజీ అధ్యయనంలో తేలింది. 40ఏళ్లు దాటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిలో ఈ మార్పు అధికంగా ఉందని తెలిపింది. ఏషియన్ హెల్త్ కేర్ ఫౌండేషన్ తో కలిసి ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్రాస్ట్రో ఎంటరాలజీ మొత్తం 1636 మంది ఆరోగ్య కార్యకర్తల పై అధ్యయనం చేసింది. వీరంతా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న ఆరు నెలల తర్వాత యాంటీ బాడీల స్థాయిలను అంచనా వేశారు. వీరిలో యాంటిబాడీల తగ్గుదల కనింపించిందని అధికారులు అంటున్నారు. వీరంతా కూడా మధుమేహం, అధిక రక్త పోటుతో బాధపడుతున్న వారేనని తెలిపారు. దీంతో ఆరు నెలల తర్వా వీరంతా బూస్టర్ డోస్ తీసుకోవాలని సూచించారు. ౌ

ఇవి కూడా చదవండి: 

రాజులు మెచ్చిన గాజుల షాప్

వీగన్స్ ​కోసం స్పెషల్​ చికెన్ 65, సలాడ్స్​