విద్యార్థి ఉద్యమకారులకు10 శాతం ఉద్యోగ కోటా ఇవ్వాలి : తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైర్మన్ చీమ శ్రీనివాస్

విద్యార్థి ఉద్యమకారులకు10 శాతం ఉద్యోగ కోటా ఇవ్వాలి : తెలంగాణ ఉద్యమకారుల  ఫోరం చైర్మన్ చీమ శ్రీనివాస్

ముషీరాబాద్, వెలుగు: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన విద్యార్థి ఉద్యమకారులకు ఉద్యోగాల్లో 10 శాతం కోటా ఇవ్వాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం జరిగిన ఉద్యమకారుల సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఏర్పాటులో సీఎం రేవంత్ రెడ్డి కీలక భూమిక పోషించారని కొనియాడారు. కేసులు, జైలు జీవితం, ఉద్యమ చరిత్ర ఫొటోలు, ప్రెస్​నోట్​ల ఆధారంగా ఉద్యమకారులను గుర్తించాలన్నారు. 

వారికి ఐడీ కార్డులు, 250 గజాల ఇంటి స్థలం, రూ.25 వేల పెన్షన్, హెల్త్, బస్సు పాసులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యమకారుల సంక్షేమ బోర్డుకు రూ.10 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని, తెలంగాణ ఉద్యమాన్ని ప్రపంచానికి చూపించిన జర్నలిస్టులను ఆదుకోవాలని కోరారు. ఉద్యమకారులు కరుణాకర్ రెడ్డి, నాగరాజు, ఆకాంక్షల వేదిక అధ్యక్షుడు కుమారస్వామి, పూసల శ్రీనివాస్, బోగె పద్మ, దయానంద్, జగన్ యాదవ్, ఆనంద్, గగన్ కుమార్, ఆర్కే.భూపాల్ తదితరులు పాల్గొన్నారు.