బీజేపీని వీడుతున్న తెలంగాణ ఉద్యమకారులు

బీజేపీని వీడుతున్న తెలంగాణ ఉద్యమకారులు

హైదరాబాద్, వెలుగు : తెలంగాణ ఉద్యమకారులు ఒక్కొక్కరుగా బీజేపీని వీడుతున్నారు. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి ఇటీవల బీజేపీకి రాజీనామా చేశారు. టికెట్ రాకపోవడంతో తెలంగాణ ఉద్యమకారిణి, కరీంనగర్ ఉమ్మడి జిల్లా మాజీ జడ్పీ చైర్​పర్సన్ తుల ఉమ బీజేపీ నుంచి బయటికొచ్చి బీఆర్ఎస్​లో చేరారు. అంతకుముందు మాజీ ఎంపీలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకట స్వామి కూడా పార్టీని వీడారు. మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ కూడా బీజేపీ నుంచి బయటికొచ్చారు.

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ చాలా రోజుల ముందే పార్టీకి రాజీనామా చేశారు. ఇలా తెలంగాణ ఉద్యమకారులకు అండగా నిలిచిన బీజేపీ.. మూడు, నాలుగు నెలల నుంచి అందరినీ దూరం చేసుకుంటూ వస్తున్నది. అయినా... పార్టీ పెద్దలు మాత్రం దీనిపై స్పందించడం లేదు. ఇక పార్టీ నుంచి సస్పెండ్ అయిన వారిలో జిట్టా బాలకృష్ణా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​రెడ్డి ఉన్నారు. బీజేపీలో కొనసాగుతున్న తెలంగాణ ఉద్యమకారుడు

మాజీ టీఎస్​పీఎస్సీ సభ్యుడు విఠల్, మాజీ ఎంపీ బూర నర్సయ్యకు టికెట్లు ఇవ్వలేదు. కొన్నేండ్ల కింద తెలంగాణ ఉద్యమకారులను అక్కున చేర్చుకున్న బీజేపీ.. ఇప్పుడు ఏదో ఒక కారణంతో వాళ్లను పక్కన పెడ్తుండటం పార్టీ నేతలను ఆందోళనకు గురి చేస్తున్నది. బీజేపీ హైకమాండ్ దీనిపై దృష్టి పెట్టకపోతే మరికొంత మంది ఉద్యమకారులు కూడా పార్టీ వీడే ప్రమాదం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు