- వార్షిక రుణ ప్రణాళిక రూ.6.33 లక్షల కోట్లు
- వ్యవసాయరంగానికే రూ.లక్షా 34 వేల 138 కోట్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వార్షిక రుణ ప్రణాళికను బుధవారం ఎస్ఎల్బీసీ సమావేశంలో రిలీజ్ చేశారు. దీనికింద 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.6.33 లక్షల కోట్లు బ్యాంకులు వివిధ రంగాల కింద రుణాలు ఇవ్వనున్నాయి. ఇందులో వ్యవసాయ రంగా నికి రూ.1,34,138 కోట్ల రుణం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈసారి ఖరీప్, రబీ పంట రుణాలకు కలిపి 48.31 లక్షల మంది రైతులకు రూ.81,478 కోట్లు టార్గెట్ ఉన్నది.
ఎంఎ స్ఎం ఈ రంగానికి రూ.1.29 లక్షల కోట్లు రుణాలు ఇవ్వనున్నారు. ఎక్స్‌పోర్ట్ క్రెడిట్ కింద రూ.451 కోట్లు, విద్యారంగానికి రూ.2,706 కోట్లు, గృహనిర్మాణానికి రూ.10,768 కోట్లు, సంప్రదాయేతర ఇంధన వనరులకు రూ.566 కోట్లు, సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వాల్వింగ్ బ్యాంక్ క్రెడి ట్ కింద రూ.836 కోట్లు, ఇతర ప్రాధాన్యతా రంగాల్లో రూ.16,776 కోట్ల రుణం లక్ష్యంగా పెట్టుకున్నారు. నాన్ ప్రయారిటీ సెక్టార్లో రూ.3.53 లక్షల కోట్లు ఇవ్వాలని వార్షిక రుణ ప్రణాళికలో పేర్కొన్నారు.
