న్యాయస్థానం ఆదేశాల మేరకు ఎన్నికలు నిర్వహించాలి..తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ

న్యాయస్థానం ఆదేశాల మేరకు ఎన్నికలు నిర్వహించాలి..తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ

బషీర్​బాగ్, వెలుగు: పదేళ్లుగా ఎన్నికలు నిర్వహించకుండా రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సంస్థ(ఐడీసీ) మాజీ చైర్మన్ అమరవాది లక్ష్మీనారాయణ గత ప్రభుత్వ అండదండలతో అధికారం చెలాయించాడని తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఆరోపించింది. ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలపై న్యాయస్థానం తీర్పుతో  ప్రజాస్వామ్యం  గెలిచిందని ఆర్యవైశ్య మహాసభ  తెలిపింది. 

హైదర్ గూడలోని ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షుడు మిడిదొడ్డి శ్యాంసుందర్, మహాసభ ప్రక్షాళన కన్వీనర్ మొగుళ్లపల్లి ఉపేందర్‌‌‌‌ మాట్లాడుతూ.. రూ. 10 వేలు ఉన్న నామినేషన్ ఫీజును లక్షకు పెంచారని, ఐవీఎఫ్ అండ్ వామ్ సభ్యులను పోటీకి అనర్హులుగా ప్రకటించి  ప్రజాస్వామాన్ని అమరవాది తుంగలో తొక్కారన్నారు.  ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీతో ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందన్నారు.