అగ్రి కల్చర్ వర్సిటీలో విత్తన మేళా ప్రారంభం

అగ్రి కల్చర్ వర్సిటీలో విత్తన మేళా ప్రారంభం

గండిపేట,వెలుగు: తెలంగాణ గ్లోబల్​ సీడ్ హబ్ గా మారనుందని విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండ బాలకోటేశ్వర్ రావు అన్నారు. రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 18 కేంద్రాల్లో మంగళవారం విత్తన మేళాలు ప్రారంభమయ్యాయి. వర్సిటీ ఆడిటోరియంలో జరిగిన ప్రోగ్రామ్​కు చీఫ్ గెస్టుగా హాజరైన బాలకోటేశ్వర్ రావు విత్తన మేళాను ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. వర్సిటీల్లో విత్తనాభివృద్ధిపై మరింత విస్తృతంగా పరిశోధనలు జరగాలన్నారు.  అగ్రికల్చర్ వర్సిటీ, ప్రభుత్వ సంస్థలు అందించే విత్తనాలు నాణ్యతతో పాటు తక్కువ రేటు ఉంటాయని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్‌ హనుమంతు అన్నారు.  కార్యక్రమంలో వర్సిటీ వీసీ డాక్టర్ వి. ప్రవీణ్ రావు, రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్. సుధీర్ కుమార్, రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ జగదీశ్వర్, సీడ్స్ డైరెక్టర్ డాక్టర్ పి. జగన్మోహన్ రావు, అధికారులు, సైంటిస్టులు, స్టూడెంట్లు పాల్గొన్నారు.